
హైదరాబాద్, వెలుగు: టాలీవుడ్ నటి సమంతకు కూకట్‌పల్లి కోర్టులో ఊరట లభించింది. సమంత పర్సనల్ లైఫ్‌కి సంబంధించి ఎలాంటి వీడియోలు టెలికాస్ట్ చేయొద్దని యూట్యూబ్ చానల్స్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారంటూ రెండు యూట్యూబ్ చానల్స్ (సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ)పై కూకట్‌పల్లి కోర్టులో సమంత కేసు ఫైల్ చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్డు మంగళవారం ఇంజక్షన్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఇదే క్రమంలోనే సమంతకు కూడా పలు సూచనలు చేసింది. వ్యక్తిగత వివరాలతో కూడిన కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరాదని కోర్టు ఆమెకు సూచించింది.