
రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషీ(Khushi). ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి. ఖుషి సినిమా థియేటర్లలో 2023 సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. దీంతో మూవీ టీం ప్రొమోషన్స్లో జోరు పెంచింది.
లేటెస్ట్గా విజయ్ దేవరకొండ, సమంత మాట్లాడుకున్న వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ తన ట్విట్టర్లో వీడియో షేర్ చేశారు. మిడ్ నైట్ సమంత వీడియో కాల్ చేయగా.. సామ్ హే whatsup అంటూ..ఏమైంది? అంతా ఓకేనా ? అని స్మైల్ ఇస్తూ అడగ్గా..విజయ్ ఏం లేదు..కానీ, నిన్ను మిస్ అవుతున్న..నీ కోసం Knock Knock జోక్ చెప్తా అంటూ.. నా రోజా నువ్వే..నా దిల్ సే నువ్వే అని సాంగ్ పాడారు విజయ్..దీంతో సామ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మెస్మరైజ్ చేసింది. దీంతో రౌడీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో..అర్ధరాత్రి సమంతతో రౌడీ చిట్ చాట్ అంటూ..అలాగే, ఏంటి విజయ్ బ్రో..సినిమా రిలీజ్కి ఇంకా నాలుగు రోజులే ఉండటంతో మేం టెన్షన్ పడుతుంటే, నువ్వు చాలా ఎంజాయ్ చేస్తున్నావ్ అంటూ.. భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఖుషి మూవీ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్(Hesham abdul wahab) హృదయాలను హత్తుకునేలా సాంగ్స్ కంపోజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా..థియేటర్లలో 2023 సెప్టెంబర్ 1న తెలుగు,తమిళం,మలయాళం, హిందీ,కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
Knock knock
— Vijay Deverakonda (@TheDeverakonda) August 27, 2023
Who is there?#Kushi is - in 4 days! Yayyyy! ?@Samanthaprabhu2 pic.twitter.com/9lfNfxPbGk