
పెళ్లయ్యాక హీరోయిన్ సమంత వెరైటీ స్టోరీస్ ను సెలక్షన్స్ చేసుకుంటుంది. ఇటీవల వచ్చిన యూటర్న్ లో నటించి ఆకట్టుకున్న సమంత ప్రస్తుతం మరో వెరైటీ మూవీతో ప్రేక్షకులముందుకు రాబోతోంది. నందిని రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా ఉంటుందని అప్పట్లో ప్రమోషన్స్ జరిగాయి. ఈ సినిమా సైలెంట్ గా ఫినిష్ చేసేసింది సమంత. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేసింది సినిమా యూనిట్.
ఈ సినిమాకు‘ఓ బేబీ’ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలిపింది సమంత. తన లుక్ కు సంబంధించిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. సామ్ లుక్స్ సపర్బ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఫొటోలో సామ్ సింగర్ గా కనిపించింది. అలనాటి నటి లక్ష్మీతో కలిసి సమంత డాన్స్ చేస్తున్న పిక్ బాగా ఆకట్టుకుంటుంది.
మరోపక్క శివ డైరెక్షన్ లో చైసామ్ నటించిన ‘మజిలీ’ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కాబోతోంది. సామ్ తమిళ సినిమా ‘96’ తెలుగు రీమేక్ లో నటించబోతుంది. శర్వానంద్ హీరో. దిల్‌రాజు నిర్మాత. ఈ సినిమాకు ‘జానకీ దేవి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.