
ఓవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోలకు జోడీగా కనిపించడానికి కూడా ఓకే చెబుతోంది సమంత. అందుకే శాకుంతలమ్, యశోద లాంటి డిఫరెంట్ సినిమాలతో పాటు ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ లాంటి కమర్షియల్ మూవీస్ కూడా ఆమె చేతిలో ఉన్నాయి. వీటన్నింటినీ జెడ్ స్పీడులో పూర్తి చేస్తూ బిజీబిజీగా ఉంది సామ్. ‘కాత్తువాక్కుల రెండు కాదల్’లో తన పార్ట్ డబ్బింగ్ వర్క్‌ని నిన్న కంప్లీట్ చేసింది. దీంతో ఈ ప్రేమకథకి సంబంధించి సమంత చేయాల్సిన వర్క్ మొత్తం కంప్లీటయ్యింది. ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్న సమంత.. ఈ సినిమా విషయంలో చాలా ఎక్సయిటవుతున్నానని, రోజులన్నీ ఎంతో సరదాగా గడిచిపోయాయని, మూవీని ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా అని ఉందని చెప్పింది. విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఓ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. ‘కణ్మణి ర్యాంబో ఖతీజా’ పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది. కణ్మణిగా నయనతార, ర్యాంబోగా విజయ్ సేతుపతి, ఖతీజాగా సమంత కనిపించనున్నారు. ఈ నెల 28న సినిమా రిలీజ్.