
ఆమెకు జిమ్నాస్టిక్స్ అంటే ప్రాణం. కానీ,అదే జిమ్నాస్టిక్స్ .. ఆమె రెండు కాళ్లనూ విరిచేసింది. అమెరికాలోని ఆబర్న్ యూనివర్సిటీకి చెందిన సమంతా సెరియో అనే జిమ్నాస్ట్.. శుక్రవారం జరిగిన బేటన్ రోగ్ రీజనల్ పోటీల్లో పాల్గొంది. ఫస్ట్ పాస్ చేస్తున్న సందర్భంలో ఆమె ఎగిరి మ్యాట్పై ల్యాం డ్ అయ్యింది. కానీ, ఆ ల్యాండింగ్ సరిగ్గా కాకపోవడంతో రెండు కాళ్లూ మోకాళ్ల వద్ద విరిగిపోయాయి. నొప్పి తో ఆమె విలవిల్లాడిపోయింది. కొద్ది సేపటిదాకా ఎవరికీ ఏం అర్థం కాలేదు. తీవ్రమైననొప్పి తో ఆమె ఏడ్చే వరకూ కాళ్లు విరిగిన సంగతి అక్కడి వారికి తెలియలేదు. డాక్టర్లు వచ్చి ఆమెను స్ట్రెచర్పైకి ఎక్కించి తీసుకెళ్లేటప్పుడూ తన గురించి ఆలోచించకుండా.. సహచరులను చూసుకోవాలని కోచ్ కు చెప్పింది. శుక్రవారమే తన జిమ్నాస్టిక్స్ కెరీర్కు చివరి రోజు అని ప్రమాదం అనంతరం సెరియోఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. 18 ఏళ్లుగా తన కెరీర్కు జిమ్నాస్టిక్స్ ఎంతగానో తోడ్పడిందని, అదే కష్టపడేతత్వాన్ని, గౌరవాన్ని, సమగ్రత, అంకితభావాన్ని నేర్పిందని చెబుతూ కెరీర్కు గుడ్ బై చెప్పింది.