Samantha: ఇదెక్కడి ట్విస్ట్.. మెగాస్టార్తో సమంత.. షూట్ కూడా కంప్లీట్!

Samantha: ఇదెక్కడి ట్విస్ట్.. మెగాస్టార్తో సమంత.. షూట్ కూడా కంప్లీట్!

సౌత్ స్టార్ బ్యూటీ సమంత(Samantha) ఆడియన్స్ కు షాకిచ్చారు. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న ఆమె తాజాగా మెగాస్టార్(Megastar) తో జత కట్టారట. ఈ ప్రాజెక్టు షూటింగ్ కూడా కంప్లీట్ అయిందని, త్వరలో విడుదలకు సిద్ధంగా ఉందని టాక్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన ఆడియన్స్ అవాక్కవుతున్నారు. ఇంత సైలెంట్ గా ఎప్పుడు కంప్లీట్ చేశారు? అది కూడా మెగాస్టార్ తో? ఇంతకీ ఏ సినిమా కోసం? అంటూ  ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మొన్నటివరకు మాయిసైటిస్ వ్యాధితో బాధపడిన సమంత.. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమా షూటింగ్స్ లో బిజీ అవుతున్నారు. ఇటీవలే ఆమె హాలీవుడ్ నుండి హిందీలో రీమేక్ అవుతున్న సూపర్ హిట్ వెబ్ సిరీస్ సిటాడెల్ షూట్ ను కంప్లీట్ చేశారు. బన్నీ, సన్నీ పేరుతో వస్తున్న ఈ ప్రాజెక్టు నుండి ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. 

అయితే తాజా సమాచారం ప్రకారం సమంత మరో క్రేజీ స్టార్ తో జతకట్టారట. ఆ స్టార్ మరెవరో కాదు మెగాస్టార్. అవును మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. అది కూడా ఒక కమర్షియల్ యాడ్ కోసం. ఈ ఇయరు స్టార్స్ కలిసి ఐసీఎల్‌ ఫిన్‌ కార్పో అనే ఫైనాన్స్ సంస్థ కమర్షియల్‌ కోసం కలిసి నటించారు. ఇప్పటికే షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ యాడ్ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ యాడ్ షూట్ కు సంబందించిన పిక్స్ ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అవికాస్తా వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సమంత కంబ్యాక్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.