అడ్వాన్సులు తిరిగి ఇచ్చేస్తున్న సమంత.. బ్రేక్కు కారణం ఏంటీ?

అడ్వాన్సులు తిరిగి ఇచ్చేస్తున్న సమంత.. బ్రేక్కు కారణం ఏంటీ?

హీరోయిన్ సమంత(Samantha) పలు భాషల్లో వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఇటీవల వచ్చిన మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలుస్తుంది.  తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు విషయాలను పంచుకున్నారు సమంత. 

"ఏడాది కాలం పాటు  సినిమాలకు  విరామం తీసుకోనున్నట్లు నిర్ణయించుకుంది.  ఇప్పుడే కోలుకుంటున్న నా ఆరోగ్యాన్ని తిరిగి  మరింత శక్తి పొందడానికి, అదనపు చికిత్స కోసం ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే నాకు తీవ్రమైన మైగ్రేన్ ఉంది.. నా కళ్లలో విపరీతమైన నొప్పి ఉంది,  అలా నొప్పితో కళ్ళు బాగా ఉబ్బుతాయి..గత 8 నెలలుగా ఇదే పరిస్థితి ఉంది. ఇలానే ఉంటే సినిమాల్లో నటించడానికి ఒక నటిగా చాలా ఇబ్బందులు ఎదురువుతాయి" అంటూ మీడియాకు తన పరిస్థితిని వివరించింది. 

ప్రస్తుతం సమంత నటిస్తున్న సిటాడెల్ ఇండియా(Citadel India), విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తో  ఖుషీ(Khushi)  మూవీస్ అయిపోగానే విరామం తీసుకుంటుందని తెలుస్తోంది. ఇప్పటికే సమంత తెలుగు, తమిళం, బాలీవుడ్ చిత్రాలకు సంతకం చేయకూడదని నిర్ణయించుకుంది.

అలాగే ఆల్రెడీ కమిట్ అయినా సినిమాలను కూడా ఆపేయాలని.. తీసుకున్న అడ్వాన్స్ నిర్మాతలకు తిరిగి ఇచ్చేసేంది అని సమాచారం. కాగా సమంత గత చిత్రం శాకుంతలం అంతగా ఆకట్టుకోలేదు.