సొంత గూటికి మాజీ మంత్రి సంభాని జగ్గారెడ్డి, కోదండరెడ్డి

సొంత గూటికి మాజీ మంత్రి సంభాని జగ్గారెడ్డి, కోదండరెడ్డి
  •  సమక్షంలో కాంగ్రెస్​లో చేరిక

హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తిరిగి కాంగ్రెస్ లో చేరారు. శుక్రవారం గాంధీ భవన్​లో కాంగ్రెస్ చేరికల కమిటీ సభ్యులు జగ్గారెడ్డి, కోదండరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన మరికొందరు నాయకులు కూడా కాంగ్రెస్​కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన మరో నేత సంగిశెట్టి జగదీశ్వర్ రావుకు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. 

సంభాని.. అసెంబ్లీ ఎన్నికల మందు సత్తుపల్లి టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో బీఆర్ఎస్ లో చేరిన ఆయన.. తిరిగి సొంతగూటికి చేరారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీలో చేరేందుకు ఎవరు వచ్చినా చేర్చుకుంటామన్నారు. తనకు వ్యతిరేకం గా పనిచేసిన వారు వచ్చినా కాంగ్రెస్ లో చేర్చుకుంటానన్నారు. రాజీవ్ ను చంపిన వ్యక్తులను క్షమించిన గుణం సోనియా, రాహుల్, ప్రియాంకలదని.. వారి ఆదేశాల ను పాటించాల్సిందేనన్నారు. 

‘సంగారెడ్డి బీఆర్ఎస్​ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతా రు.. నీ అభిప్రాయం ఏమిటి’ అని మంత్రి దామోదర రాజనర్సింహ తనను అడిగితే చేర్చుకోండని చెప్పానని జగ్గారెడ్డి తెలిపా రు. వచ్చే ఎన్నికల్లో ఆయన టికెట్ అడిగినా ఇచ్చేయండని చెప్పానన్నారు. ఘర్ వాపసీ మొదలు పెట్టామని, గత రెండు రోజులుగా చాలా మంది నాయకులు తిరిగి వెనక్కి వస్తున్నారని ఆయన చెప్పారు.