
న్యూఢిల్లీ: హెల్త్, కన్ఫెక్షనరీ (తీపి పదార్ధాలు) ప్రొడక్ట్‌లను తయారుచేసే సాంప్రే నూట్రిషన్స్ రూ.355 కోట్లను సేకరించేందుకు రెడీ అవుతోంది. కంపెనీ 40 మిలియన్ డాలర్ల విలువైన ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ (ఎఫ్‌సీసీబీల) ను జారీ చేయనుంది. లక్ష డాలర్ల ఫేస్‌వాల్యూ ఉన్న 400 బాండ్లను అమ్మనుంది. ఈ నిధులను ఈజిప్ట్, లైబీరియా (మన్రోవియా) వంటి అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ మార్కెట్లలో వ్యాపార విస్తరణకు వినియోగిస్తామని కంపెనీ తెలిపింది. వృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో తమ ఉనికిని బలపరుచుకోవాలని చూస్తోంది. అంతేకాకుండా అంతర్జాతీయ ఎఫ్‌ఎంసీజీ రంగంలో కొత్త అవకాశాలను అందుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. గ్లోబల్ స్థాయిలో తమ ఉత్పత్తులను విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ పేర్కొంది.