- 4-1తో సిరీస్ సొంతం
- రాణించిన శివం దూబే
- 25 రన్స్ తేడాతో జింబాబ్వే చిత్తు
హరారే: జింబాబ్వే టూర్‌ను యంగ్ ఇండియా సక్సెస్‌ఫుల్‌గా ముగించింది. బ్యాటింగ్‌లో సంజు శాంసన్ (45 బాల్స్‌లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 58), బౌలింగ్‌లో ముకేశ్ కుమార్ (4/22)కు తోడు శివం దూబే (12 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26; 2/25) ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటడంతో ఆదివారం జరిగిన చివరి, ఐదో టీ20లో టీమిండియా 42 రన్స్ తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. దాంతో ఐదు టీ20ల సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 167/6 స్కోరు చేసింది. గత మ్యాచ్‌లో చెలరేగిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ (12) తొలి రెండు బాల్స్‌కు సిక్సర్లు కొట్టి వెంటనే ఔటవగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (13), అభిషేక్ శర్మ (14) ఫెయిలయ్యారు. దాంతో ఓ దశలో 40/3తో నిలిచిన జట్టును శాంసన్ ఆదుకున్నాడు. రియాన్ పరాగ్ (22)తో నాలుగో వికెట్‌కు 65, శివం దూబే (30)తో ఐదో వికెట్‌కు 30 రన్స్ జోడించాడు. చివర్లో దూబే మెరుపులతో ఇండియా మంచి స్కోరు చేసింది. ఆతిథ్య బౌలర్లలో ముజరబాని రెండు వికెట్లతో రాణించాడు. అనంతరం ఛేజింగ్‌లో జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 రన్స్‌కే ఆలౌటై ఓడింది. డియోన్ మైయర్స్ (34), ఫరాజ్ అక్రమ్ (27) తప్ప మిగతా బ్యాటర్లు
నిరాశ పరిచారు. శివం దూబేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, వాషింగ్టన్ సుందర్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 167/6 (శాంసన్ 58, దూబే 26, ముజరబాని 2/19)
జింబాబ్వే: 18.3 ఓవర్లలో 125 ఆలౌట్ (మైయర్స్ 34, మరుమణి 27, ముకేశ్ 4/22, దూబే 2/25).