శాంసంగ్ నుంచి ఫోల్డబుల్‌‌ ఫోన్

శాంసంగ్ నుంచి ఫోల్డబుల్‌‌ ఫోన్

త్వరలో  శాంసంగ్  గెలాక్సీ  ఫోల్డ్ -2 ఫోన్ ను విడుదల చేయనుంది. దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ 2020 లో అన్నీ రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  వాటిలో ముఖ్యంగా ఫ్లాగ్ షిప్ ఎస్ 11, గెలాక్సీ ఫోల్డ్ 2 ఫోన్ల విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.

అయితే ఇప్పటికే ఎస్ 11 గురించి ఐడియా ఉన్నప్పటికి, గెలాక్సీ ఫోల్డ్ మొబైల్ ఫీచర్స్ గురించి శాంసంగ్ గోప్యంగా ఉంచింది. దీంతో  ఎస్ 11 గురించి అనేక రూమర్స్ టెక్ ప్రపంచంలో చక్కెర్లు కొడుతున్నాయి.

♦  ఈ ఫోన్ రిలీజ్ ఎప్పుడు ..

ఈ ఫోన్ విడుదల గురించి కంపెనీ అధికారికంగా ప్రకటించనప్పటికి , ఫ్రిబవరి నెలలో ఎస్11 తో పాటు మరికొన్ని ఫొన్లు  విడుదలవుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. కానీ ఫిబ్రవరి నెలలో ఎస్ 11 గెలాక్సీ ఫోల్డ్ మొబైల్ ను విడుదల చేసిన తరువాతనే మిగిలిన స్మార్ట్ ఫోన్ లను శాంసంగ్ విడుదల చేయాలని భావిస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

♦  గెలాక్సీ2 – ఫోల్డ్ మొబైల్ ఎలా ఉండబోతుందంటే..?

సాధారణంగా గెలాక్సీ సిరీస్ లోని ఫోన్ మోడల్ ఎలా ఉంటుందో ఎస్ 11 ఫోల్డ్ మొబైల్ కూడా అలాగే ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచానా వేస్తున్నాయి. బయటవైపు 4.6 అంగుళాల డిస్ ప్లే,  లోపల ప్రాధమిక 7.3-అంగుళాల ఫోల్డబుల్ ప్యానెల్‌ ఉంటుంది.

♦   2020లోనే అత్యంత ఖరీదైన  ఫోల్డ్ బుల్  మొబైల్ గా తీర్చిదిద్దేందుకు కసరత్తు

ఈ ఏడాది విడుదల చేసే ఈ ఫోన్ ను అత్యంత ఖరీదైందిగా, దృంఢంగా ఉండేలా శాంసంగ్ తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఆల్ట్రా తిన్ గ్లాస్ కవర్ తో ఫోన్ డిజైన్ చేయనుంది. అల్ట్రా తిన్ గ్లాస్ కవర్ తో డిజైన్ చేయడం ద్వారా ఫోన్ ను ఫోల్డ్ చేసేందుకు, ఫోల్డ్ చేసేసమయంలో ఎలాంటి గీతలు పడకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోనుంది.

ఈ ఫోన్ తో పాటు అత్యంత ఖరీదైన మోటరోలా రేజర్ లాంటి క్లామ్ షెల్ డిజైన్ ను అందుబాటులోకి  తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఎస్ -11 ఫోల్డ్ 2కి ఎలాంటి సంబంధం లేకున్నా ఈ ఫోన్ కంటే క్లామ్ షెల్  తో  డిజైన్ చేసిన ఫోన్  కాస్ట్ ఎక్కువగా ఉండనుంది.

♦   గెలాక్సీ ఫోల్డ్ 2లో  ఎలాంటి ఫీచర్స్  ఉండబోతున్నాయి..?

శాంసంగ్ సంస్థ ఫోల్డ్ మొబైల్ గురించి  అంతగా తెలియని  కోర్ హార్డ్ వేర్ ను వినియోగించినట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. అయినప్పటికి ఫ్లాష్ షిప్ స్పెసిఫికేషన్ తరహాలో మార్కెట్ ను శాసిస్తున్నట్లు కంపెనీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి.

సాధారణంగా ఫోన్లు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 865తో విడదలవుతాయి. కానీ  శాంసంగ్ సంస్థ ఫోల్డ్ మొబైల్ లో గెలాక్సీ 865 ఎస్ ఓఎస్ తో విడుదల చేయనుంది. 8జీబీ ర్యామ్ నుంచి  128 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం ఉంటుందని తెలుస్తోంది.  శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ మొబైల్ తో పోలిస్తే  గెలాక్సీ  ఫోల్డ్ -2 ఫోన్ లో  3 మాత్రమే లెన్స్ లు ఉంటాయి. ఆరు కెమెరాలు, బయటవైపు సింగల్ కెమెరా, లోపలి వైపు డ్యూయల్  కెమెరా ఉంటుంది. ఎప్పటిలాగే హెడ్ ఫోన్ జాక్ ను వదిలేసిన…సంస్థ  ఫోన్ జాక్ స్థానంలో  సీ టైప్ ఛార్జర్ పోర్ట్ ను ఇచ్చింది. ఈ ఫోన్ శాంసంగ్  యొక్క ఆండ్రాయిడ్ 10 బేస్డ్ వన్ యుఐ 2 ఆపరేటింగ్ సిస్టమ్ బాక్స్ నుండి బూట్ అవుతుందని భావిస్తుంది.

♦   శాంసంగ్ గెలాక్సీ ఫోన్ ధర ఎంతంటే..?

గెలాక్సీ గోల్డ్ ఫోన్ తో పోలిస్తే గెలాక్సీ  ఫోల్డ్ -2 ఫోన్ కాస్ట్ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర సుమారు 2వేల డాలర్లు ఉంటుందని స్మార్ట్ ఫోన్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.