శామ్​సంగ్​ నుంచి గెలాక్సీ ఎఫ్​15

శామ్​సంగ్​ నుంచి గెలాక్సీ ఎఫ్​15

న్యూఢిల్లీ: శామ్​సంగ్​ గెలాక్సీ సిరీస్​లో మరో కొత్త 5జీ ఫోన్​ ఎఫ్​15ను లాంచ్​ చేసింది.  ఇందులో అమోలెడ్ స్క్రీన్​, మీడియాటెక్​ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ, వెనుక మూడు, ముందు ఒక కెమెరాలు ఉంటాయి. 

గెలాక్సీ ఎఫ్​15 5జీ ధర  4జీబీ ర్యామ్​ + 128జీబీ  బేస్ వేరియంట్​కు 12,999 కాగా, 6జీబీ ర్యామ్​ + 128జీబీ స్టోరేజ్ మోడల్‌‌ ధర రూ. 14,499. హ్యాండ్‌‌సెట్ యాష్ బ్లాక్, గ్రూవీ వైలెట్  జాజీ గ్రీన్ కలర్స్​లో అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌‌కార్ట్ ద్వారా దీనిని కొనవచ్చు.