ఫాల్​ డిటెక్షన్​ ఫీచర్​తో​ గెలాక్సీ ఫిట్ ​3

ఫాల్​ డిటెక్షన్​ ఫీచర్​తో​ గెలాక్సీ ఫిట్ ​3

హైదరాబాద్​, వెలుగు: శామ్​సంగ్​ గెలాక్సీ ఫిట్​3 అనే సరికొత్త ఫిట్‌‌నెస్ ట్రాకర్‌‌ను పరిచయం చేసింది. ఫాల్ డిటెక్షన్  ఎమర్జెన్సీ ఎస్​ఓఎస్​, స్లీప్​ ట్రాకింగ్​ సహా పలు ఫీచర్లు ఇందులో ఉన్నాయి.   కింద పడిపోయినప్పుడు వినియోగదారులు వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేసే అవకాశం ఉంటుంది.  

సైడ్ బటన్‌‌ను ఐదుసార్లు నొక్కడం ద్వారా ఎమర్జెన్సీ అలెర్ట్​ను పంపవచ్చు. రూ. ఐదు వేల ధర ఉండే ఈ ట్రాకర్​లో 1.6- అంగుళాల డిస్‌‌ప్లే,  అల్యూమినియం బాడీ ఉంటాయి.  ఒక్కసారి చార్జ్​ చేస్తే ట్రాకర్ 13 రోజుల వరకు పనిచేస్తుంది.