
హైదరాబాద్, వెలుగు: దేశీయ మార్కెట్లోకి ప్రీమియం ఏఐ ఇంటిగ్రేటెడ్ క్యూఎల్ఈడీ సిరీస్ క్రిస్టల్ క్లియర్ 4కే యూహెచ్డీ టీవీలను విడుదల చేశామని శామ్సంగ్ తెలిపింది. ఇవి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో యూఈ81, యూఈ84, యూఈ86ఈ మోడల్స్ఉంటాయి.
ఈ క్యూఎల్ఈడీ టీవీల్లో శక్తివంతమైన ఏఐ ప్రాసెసర్లు ఉండటం వల్ల పిక్చర్ క్వాలిటీ, సౌండ్ అద్భుతంగా ఉంటాయని కంపెనీ తెలిపింది. క్వాంటం డాట్ టెక్నాలజీ వల్ల రంగులు స్పష్టంగా కనిపిస్తాయని, వీటిలో స్మార్ట్ ఫీచర్లూ ఉన్నాయని శామ్సంగ్పేర్కొంది.