శామ్‌‌సంగ్‌‌ టీవీ ధర రూ.1.15 కోట్లు

శామ్‌‌సంగ్‌‌ టీవీ ధర రూ.1.15 కోట్లు

క్యూ1 లో ఇండిగో ప్యాసింజర్లు 2.62 కోట్లకు

న్యూఢిల్లీ: ఇండిగో విమానాలను నడుపుతున్న ఇంటర్‌‌‌‌గ్లోబ్‌‌ ఏవియేషన్‌‌  ఈ ఏడాది జూన్‌‌ క్వార్టర్‌‌‌‌ (క్యూ1) లో రూ. 3,091 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌లో కంపెనీకి  రూ.1,064 కోట్ల  నష్టం వచ్చింది. కార్యకలాపాల ద్వారా వచ్చే రెవెన్యూ 30 శాతం పెరిగి  రూ.16,683 కోట్లకు చేరుకుంది.  జూన్ క్వార్టర్‌‌‌‌లో  కంపెనీ ప్యాసింజర్లు 2.62 కోట్లకు చేరుకున్నారు.  ప్రాఫిట్‌‌, రెవెన్యూ రెండూ కూడా ఎనలిస్టులు అంచనాలను అందుకున్నాయి. కాగా, ఇండిగోకి ఇదే హయ్యెస్ట్‌‌ క్వార్టర్లీ ప్రాఫిట్ కావడం విశేషం. మార్కెట్ పరిస్థితులు బాగున్నాయని,  స్ట్రాటజీలను సరిగ్గా అమలు చేయగలిగామని ఇండిగో ప్రకటించింది. జూన్ క్వార్టర్‌‌‌‌లో కంపెనీకి రూ.5,211 కోట్ల ఇబిటా (ట్యాక్స్, వడ్డీ కట్టకు ముందు ప్రాఫిట్‌‌) వచ్చింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌లో ఈ నెంబర్ రూ.717 కోట్లుగా ఉంది. టికెట్‌‌ రెవెన్యూ రూ.14,996 కోట్లు రాగా, ఇది కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే 31 శాతం ఎక్కువ. ఇతర మార్గాల ద్వారా వచ్చే రెవెన్యూ  20 శాతం పెరిగి రూ.1,548 కోట్లకు చేరుకుంది.  అత్యధిక మంది ప్యాసింజర్లను జూన్ క్వార్టర్లలో వారి గమ్యస్థానాలకు చేర్చామని,  హయ్యెస్ట్‌‌ ప్రాఫిట్‌‌ను రికార్డ్  చేశామని కంపెనీ  పేర్కొంది.


టైటాన్‌‌ నికర లాభం రూ.777 కోట్లు
జూన్ క్వార్టర్‌‌‌‌లో  రెవెన్యూ రూ.10,306 కోట్లు

న్యూఢిల్లీ: టాటా గ్రూప్ కంపెనీ టైటాన్‌‌ (స్టాండ్‌‌ఎలోన్‌‌) కు  ఈ ఏడాది ఏప్రిల్‌‌– జూన్ క్వార్టర్‌‌‌‌లో రూ. 777 కోట్ల  నికర లాభం వచ్చింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌లో వచ్చిన ప్రాఫిట్‌‌తో పోలిస్తే ఇది 2 శాతం తక్కువ.  రెవెన్యూ మాత్రం 19 శాతం పెరిగి రూ.10,306 కోట్లకు చేరుకుంది. రెవెన్యూ, ప్రాఫిట్‌‌ రెండూ కూడా ఎనలిస్టుల అంచనాల కంటే తక్కువగా వచ్చాయి. జ్యూవెలరీ సెగ్మెంట్ రెవెన్యూ కిందటేడాది జూన్‌‌ క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌లో 19 శాతం పెరిగి రూ.9,070 కోట్లకు ఎగిసింది. అక్షయ తృతీయ, గోల్డ్‌‌ ఎక్స్చేంజ్‌‌ ప్రోగ్రామ్‌‌ల వలన జ్యూవెలరీ సేల్స్ పెరిగాయని టైటాన్ వెల్లడించింది. ఎక్స్చేంజ్‌‌ ఆఫర్స్‌‌, బ్రాండ్ బిల్డింగ్ ఇనీషియేటివ్స్‌‌, మార్కెట్‌‌ షేర్‌‌‌‌ను పెంచుకోవడానికి తెచ్చిన ఇతర ప్రోగ్రామ్‌‌ల కోసం ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌లో బాగానే ఇన్వెస్ట్ చేశామని పేర్కొంది.  ‘కొత్త ఆర్థిక సంవత్సరాన్ని స్ట్రాంగ్‌గా స్టార్ట్ చేశాం. అన్ని సెగ్మెంట్లలో  డబుల్ డిజిట్‌‌ రెవెన్యూ గ్రోత్‌‌ను నమోదు చేశాం. 19 శాతంతో జ్యూవెలరీ సెగ్మెంట్‌‌ కీలకంగా కొనసాగుతోంది.  రిటైల్ నెట్‌‌వర్క్‌‌ను పెంచుకోవడానికి అన్ని కేటగిరీలలో ఇన్వెస్ట్ చేస్తున్నాం’ అని టైటాన్ ఎండీ సీకే వెంకటరమణ్ అన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్‌‌లో కూడా విస్తరిస్తున్నామని చెప్పారు. టైటాన్‌‌ వాచ్‌‌లు, వియరబుల్స్‌‌ సెగ్మెంట్ నుంచి జూన్ క్వార్టర్‌‌‌‌లో రూ.890 కోట్ల రెవెన్యూ సాధించింది. ఐకేర్‌‌‌‌ సెగ్మెంట్ రెవెన్యూ రూ.203 కోట్లకు పెరిగిందని వెల్లడించింది.

ఐటీసీ ఫుడ్స్‌‌ను స్కాన్‌‌ చేసి ఎల్‌‌జీ మైక్రోవేవ్‌‌ను వాడొచ్చు

‘స్కాన్‌‌ టూ కుక్‌‌’ ఫీచర్‌‌‌‌తో రెండు కొత్త మైక్రోవేవ్ మోడల్స్‌‌ను ఎల్‌‌జీ ఎలక్ట్రానిక్స్ తీసుకొచ్చింది. ఐటీసీ ఫుడ్స్‌‌తో పార్టనర్‌‌‌‌షిప్‌‌ కుదుర్చుకుంది.  ఈ పార్టనర్‌‌‌‌షిప్‌‌లో భాగంగా ఐటీసీ మాస్టర్‌‌‌‌ చెఫ్ ప్రోజెన్‌‌  లేదా రెడీ టూ ఈట్‌‌ ఫుడ్స్‌‌పైన ఉన్న బార్‌‌‌‌కోడ్‌‌ను  స్కాన్‌‌ చేసి,  ఎల్‌‌జీ థింక్‌‌క్యూ యాప్‌‌ ద్వారా మైక్రోవేవ్‌‌కు కుకింగ్ ఇన్‌‌స్ట్రక్షన్స్‌‌ ఇవ్వొచ్చు. 


శామ్‌‌సంగ్‌‌ టీవీ ధర రూ.1.15 కోట్లు

అల్ట్రా లగ్జరీ మైక్రో ఎల్‌‌ఈడీ టీవీని ఇండియాలో శామ్‌‌సంగ్ లాంచ్ చేసింది. ఈ టీవీ స్క్రీన్‌‌ సైజ్‌‌ 110 ఇంచులు. ధర రూ.1,14, 99,000. ఈ ఎల్‌‌ఈడీ టీవీలో 2.48 కోట్ల చిన్న సైజ్ ఎల్‌‌ఈడీలు అమర్చారు. ఈ ఎల్‌‌ఈడీలన్నీ  ఇండివిడ్యువల్‌‌గా లైట్‌‌ను, కలర్‌‌‌‌ను విడుదల చేస్తాయి. డాల్బీ అట్మోస్‌‌, క్యూ–సింఫనీ,  3డీ సౌండ్‌‌ వంటి టాప్ క్వాలిటీ ఫీచర్లు ఈ టీవీలో ఉన్నాయి.