
హైదరాబాద్: హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్–డి మ్యాచ్‌లో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. సనత్ సాంగ్వాన్ (470 బాల్స్‌లో 21 ఫోర్లు, 3 సిక్స్‌లతో 211 నాటౌట్), ఆయుష్ డోసెజా (279 బాల్స్‌లో 25 ఫోర్లు, 5 సిక్స్‌లతో 209) డబుల్ సెంచరీలతో దుమ్మురేపడంతో.. 256/3 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం (అక్టోబర్ 16) రెండో రోజు ఆట కొనసాగించిన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌ను 151 ఓవర్లలో 529/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
సనత్, ఆయుష్ నాలుగో వికెట్‌కు 319 రన్స్ భాగస్వామ్యం జోడించి భారీ స్కోరు అందించారు. అనుజ్ రావత్ (29 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. చామ మిలింద్ 3, పున్నయ్య ఒక్క వికెట్ తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ ఆట ముగిసే టైమ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో 77/1 స్కోరు చేసింది.
తన్మయ్ అగర్వాల్ (27 బ్యాటింగ్), అనికేత్ రెడ్డి (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మ్యాచ్ చివర్లో రాహుల్ సింగ్ (35) ఎల్బీ అయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్ ఇంకా 452 రన్స్ వెనకబడి ఉంది.