బిట్​ బ్యాంక్​ : అభయారణ్యాలు

బిట్​ బ్యాంక్​ : అభయారణ్యాలు

అభయారణ్యాలు బిట్​ బ్యాంక్​

  •     వరల్డ్​ నెట్​వర్క్​ బయోస్పియర్​ రిజర్వు కింద 12 భారత రిజర్వులను గుర్తించారు.
  •     తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక బయోస్పియర్​ రిజర్వు శేషాచలం.
  •     నీలరిగి బయోస్పియర్​ మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. 
  •     యునెస్కో వారు మానవుడు, జీవగోళంను ప్రవేశపెట్టిన సంవత్సరం 1971.
  •     ఏటూరు నాగారం అభయారణ్యం ములుగు జిల్లాలో ఉంది.
  •     మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో ఉన్న అభయారణ్యం ఏటూరు నాగారం.
  •     ఏటూరునాగారాం అభయారణ్యాన్ని 1999లో నోటిఫై చేశారు. 
  •     ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతర రెండేండ్లకు ఒక్కసారి జరుగుతుంది. 
  •     ఏటూరునాగారం అభయారణ్యం మొత్తం వైశాల్యం 812 చ.కి.మీ.
  •     కిన్నెరసాని వన్యమృగ సంరక్షణ కేంద్రం 1977లో ఏర్పాటు చేయబడింది.
  •     రాజీవ్​గాంధీ వైల్డ్​ లైఫ్​ అభయారణ్యంగా పిలిచే అభయారణ్యం అమ్రాబాద్​.
  •     ఏటూరునాగారం అభయారణ్యంలో రాక్షస గుహలు, చారిత్రక యుగానికి చెందిన శిలావాసాలు లభించాయి. 
  •     పాకాల అభయారణ్యం వరంగల్​ జిల్లాలో ఉంది.
  •     పాకాల అభయారణ్యం మొత్తం విస్తీర్ణం 860 చ.కి.మీ.
  •     శివ్వారం అభయారణ్యం మంచిర్యాల జిల్లాలో విస్తరించి ఉంది.
  •     మగ్గర్​ మొసళ్లను సంరక్షించే అభయారణ్యం శివ్వారం.
  •     శివ్వారం అభయారణ్యం మొత్తం వైశాల్యం 29.81 చ.కి.మీ.
  •     హైదరాబాద్​ ప్లసీ చట్టం 1952లో అమలులోకి వచ్చింది. 
  •     హైదరాబాద్​ రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం హైదరాబాద్​ ప్లసీ చట్టం చేశారు. 
  •     మంజీరా అభయారణ్యం సంగారెడ్డి జిల్లాలో ఉంది. 
  •     పోచారం అభయారణ్యం మెదక్​ జిల్లాలో ఉంది.
  •     మూడు నోటిఫైడ్​ జాతీయపార్కులను కలిగిన ఏకైక నగరం హైదరాబాద్​.
  •     అమ్రాబాద్​ పులుల సంరక్షణ కేంద్రం వైశాల్యం 2166 చ.కి.మీ.
  •     తెలంగాణలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం అమ్రాబాద్​.
  •     కవ్వాల్​ అభయారణ్యం గుండా కడెం నది ప్రవహిస్తోంది.
  •     కవ్వాల్​ అభయారణ్యాన్ని కేంద్ర ప్రభుత్వం 2012లో కేంద్రం టైగర్​ రిజర్వుగా గుర్తించింది.
  •     మృగవని జాతీయ పార్కు రంగారెడ్డి జిల్లాలో ఉంది.
  •     మృగవని జాతీయ పార్కు చిలుకూరు ప్రాంతంలో ఉంది.
  •     మహావీర్​ హరిణి వనస్థలి జాతీయ పార్కు వనస్థలిపురంలో ఉంది.
  •     జైనమత గురువు వర్ధమాన మహావీరుడు నిర్యాణం పొంది 2500 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1975లో హరిణి వనస్థలి పార్కుకు ఆయన పేరు పెట్టారు.
  •     మహావీర్​ హరిణ వనస్థలి జాతీయ పార్కులో సంరక్షించబడుతున్న ప్రధాన జంతువు జింక.
  •     హైదరాబాద్​ బంజారా హిల్స్​లో ఉన్న జాతీయ పార్కు కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు.
  •     దేశంలో వెదురును సాగుచేసే హక్కు పొందిన తొలి ప్రాంతం మెందలేఖ.
  •     1982లో చీకటి జంతువుల(నిశాచర) ఆవాసాన్ని నెహ్రూ జూలాజికల్​ పార్క్​లో ప్రారంభించారు. ఇది దేశంలో మొదటిది.
  •     మహబూబ్​నగర్​ లో పిల్లలమర్రి జింకల పార్కు ఉంది. 
  •     సహజ ఆవరణంలో జంతువులను చూపే విధానం కలిగి జూపార్క్​ నెహ్రూ జూలాజికల్​ పార్కు.
  •     అందుక్​ అనే వృక్షజాలం ఆసిఫాబాద్​, మంచిర్యాల, ఆదిలాబాద్​ జిల్లాలో అధికంగా విస్తరించి ఉంది. 
  •     అబ్దుల్​ కలాం హరిత పారిశ్రామిక వాడను సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేశారు. 
  •     రాష్ట్ర టీఎస్​ఎస్​పీఎఫ్​ పోలీస్ దళం అమీన్​పూర్​ చెరువును దత్తత తీసుకుంది. 

Sanctuaries are bit banks