ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్పీడప్​ చేయాలి : కలెక్టర్ క్రాంతి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్పీడప్​ చేయాలి : కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం కంది మండలం చేర్యాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. చేర్యాల గ్రామం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడంతో జిల్లా స్థాయి అధికారుల పనులు వేగంగా జరిగేలా చూస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో 65 ఇండ్లు మంజూరు చేయగా 12 ఇండ్లు బేస్​మెంట్​స్థాయిలో, మూడు ఇండ్లు నిర్మాణ స్థాయిలో ఉన్నట్లు చెప్పారు.

ఇల్లు పూర్తిగా లేని అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం ఇండ్లు నిర్మించి అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కంది మండలం కేంద్రం లో  గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన మోడల్ హౌజ్ ను పరిశీలించారు. మిగతా ఇండ్ల నిర్మాణ పనులు కూడా వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చలపతిరావు, ఏఈ మాధవరెడ్డి, తహసీల్దార్​విజయలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు