పొలంలో నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లోద్దని అంత్యక్రియలు అడ్డగింత

పొలంలో నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లోద్దని అంత్యక్రియలు అడ్డగింత

పుట్టినప్పుడు ఏం తీసుకురాము.. పోయోటప్పుడు ఏం తీసుకుపోము.. అలాంటప్పుడు గొడవలు, అంటరానినం లాంటి భేదాలేందుకు.. బత్రికి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియకుండా ప్రవర్తిస్తారు.. మరి చనిపోయాక కూడా ఆ కోపతాపాలేందుకు.. పాత కక్షలను మనసులో పెట్టుకొని.. సమాజంలో కొందరు అంత్యక్రియలను కూడా అట్టుకుంటున్నారు. టెక్నాలజీ ఎంతా మారినా మనుషుల ఆలోచనలో మాత్రం మార్పు రావడం లేదు. వివరాల్లోకి వెళితే.. 

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో బ్యాగరి గంగమ్మ అనే మహిళ మృతి చెందింది. అయితే గంగమ్మ భర్తకు దహన సంస్కారాలు చేసిన స్థలంలోనే ఆమె కూడా చేయాలనుకున్నారు గంగమ్మ కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో గంగమ్మ మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు తీసుకెళుతుండగా.. ఆదే దారిలో పొలం ఉన్న ఒక వర్గం వాళ్లు మృతదేహాన్ని అడ్డుకున్నారు. 

దుక్కి దున్ని.. నాటు వేసిన మా పొలంలో నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లద్దని గొడవకు దిగారు. ఏది ఏమైనా పొలంలో నుంచి పాడెను తీసుకెళ్లేది లేదని హెచ్చరించారు. దీంతో చేసేదేమీలేక పక్కన ఉన్న చెరువులో నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లి.. అంత్యక్రియలు చేశారు. ఇలాంటి అవమానం ఎవరికి జరగకూడదని.. అంటరానితనాన్ని నిర్మూలించాలని మృతురాలి మనుమడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంఘటనపై తమకు న్యాయం చేయాలని గంగమ్మ కుటుంబ సభ్యులు కోరారు.