కేసీఆర్​పై ఫస్ట్ తిరుగుబాటు నాదే : జగ్గారెడ్డి

కేసీఆర్​పై ఫస్ట్ తిరుగుబాటు నాదే : జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్ పార్టీలో కొందరు కావాలనే పని గట్టుకుని తనపై దుష్ప్రచారం చేయిస్తు న్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అ య్యారు. తాను పార్టీ మారుతున్నట్టు కొందరు సో షల్ మీడియా టీం ద్వారా ప్రచారం చేస్తున్నారని అ న్నారు. శనివారం అసెంబ్లీ మీడియా హాల్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డిలో రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసినప్పుడు ఆర్థిక కష్టాలున్నా అన్నీ దగ్గరుండి చూసుకున్నానని చెప్పారు. బాగా ఆర్గనైజ్ చేశావంటూ రాహుల్ మెచ్చుకున్నారని, ఆ యాత్రలోనే తన పేరు రాహుల్​కు నోటెడ్ అయిందన్నారు. 

అది జరిగిన పది రోజులకే జగ్గారెడ్డి పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారని అన్నారు. ‘‘ఇంత దరిద్రపు అలవాటేంది మీకు? మరీ ఇంత శాడిస్టులా మీరు? పార్టీ కోసం కష్టపడుతున్నా.. దుష్ప్రచారం చేయడం దుర్మార్గం. పార్టీలోని ముఖ్య నేతలు కనీసం కౌంటర్ ఇవ్వట్లేదు. కాంగ్రెస్ లో ఇట్లాంటి చిల్లర వ్యవహారం ఈ ఏడాదిన్నర కాలంలోనే చూస్తున్నాను. రాజకీయాల్లో సోషల్ మీడియా కల్చర్ తెచ్చిందే టీడీపీ. ఇప్పుడు ఆ కల్చర్ కాంగ్రెస్ లోకి వచ్చింది. ఎవరనేది మీరే ఊహించుకోండి. కాంగ్రెస్​లోకి ఏ పార్టీ నుంచి వచ్చినా, వాళ్లంతా కాంగ్రెస్ నేతలే’’ అని జగ్గారెడ్డి అన్నారు. రాజకీయాల్లో తన ప్రయాణం రాహుల్ గాంధీ వెంటేనని స్పష్టం చేశారు. కేసీఆర్​పై ఫస్ట్ తిరుగుబాటు తనదేనన్నారు. కాంగ్రెస్ లో 50 సీట్లలో గెలిచేటోళ్లున్నారని, కావాల్సింది క్యాషేనని కామెంట్ చేశారు. పార్టీ గొడవలు ఫ్యామిలీ గొడవల్లాంటివేనన్నారు.   

 
కొట్లాడి గెలిచిన

తనపై ప్రచారం చేస్తున్న వారి పేర్లు చెప్పి.. వారిని పెద్దోళ్లను చెయ్యదలచుకోవట్లేదని జగ్గారెడ్డి అన్నా రు. జగ్గారెడ్డి కాంగ్రెస్​లో ఉండకూడదా? అని ప్ర శ్నించారు. తాను కన్నెర్రజేస్తే వాళ్లంతా ఎక్కడ ఉం టారు? రోడ్లమీద తిరుగుతరా? అని హెచ్చరించారు. 2017లో రాహుల్ గాంధీ సభ కోసం ఎంతో కష్ట పడ్డానని చెప్పారు. 2018లో తనను పాస్​పోర్ట్​ కేసులో ప్రభుత్వం జైలుకు పంపించినా కొట్లాడి గెలిచానన్నారు. ‘‘బీఫాం ఇవ్వండి.. నా భార్య నిర్మలను నిలబెడతా అని అడిగాను. పోటీ గురించి దామోదర్, గీతారెడ్డి సహా జిల్లా నేతలందరితోనూ చర్చించాను. 

మనకు అప్పుడు 230 ఓట్లున్నాయి. అభ్యర్థిని నిలబెడితే వాళ్లు మనకు ఓటేస్తారు. అలవాటు పడతారు. లేదంటే ఓటు ఎవరికెయ్యాలో అర్థంకాక.. సిస్టమ్ ఖరాబైపోతదని పట్టుబట్టి టికెట్ ఇప్పించుకున్న. అదనంగా 9 ఓట్లు తెప్పించుకున్న. అప్పుడు కూడా ఇలాగే పార్టీ మారుతారని ప్రచారం చేశారు’’ అని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.