
‘మ్యాడ్ స్క్వేర్’తో మరో సూపర్ హిట్ అందుకున్న సంగీత్ శోభన్.. సోలో హీరోగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంబ్లర్స్’. ప్రశాంతి చారులింగా హీరోయిన్. కేఎస్‌కే చైతన్య దర్శకుడు. సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మాతలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ చిత్రం జూన్ 6న విడుదల కాబోతోంది.
శుక్రవారం (MAY23) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక మిస్టరీ ఎంటర్‌టైనర్. సంగీత్ నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆశ్చర్యపరుస్తాయి.
వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి’ అని చెప్పాడు. కొత్తకాన్సెప్ట్‌తో పూర్తి థ్రిల్లింగ్ అంశాలతో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాతలు తెలియజేశారు.
To Steal Your Hearts, 💕 The #Gamblers Are Entering Theatres ♠️♣️🎲🃏#SangeethShobhan's Gamblers First Look out now #Gamblers in Cinemas June 6, 2025@ChaitanyaKSK1 @trouperspeaks @Sai_Swetha1 @tharapc6 @SunilrajuChint1 #Reshmasstudios #ShreyasMedia pic.twitter.com/fvNJHYEzR6
— Shreyas Media (@shreyasgroup) May 23, 2025
రాకింగ్ రాకేష్ పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్, మల్హోత్త్ర శివ, శివారెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, మధుసూదన్ రావు, ఛత్రపతి శేఖర్, సూర్య భగవాన్ దాస్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.