
సోలో హీరోగా సంగీత్ శోభన్ ఇంట్రెస్టింగ్ మూవీతో వస్తున్నాడు. ‘మ్యాడ్ స్క్వేర్’తో సూపర్ హిట్ అందుకున్న సంగీత్ శోభన్ ‘గ్యాంబ్లర్స్’ అని ఓ మిస్టరీ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సంగీత్ శోభన్‌కు జోడిగా ప్రశాంతి చారులింగా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడంతో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
లేటెస్ట్గా నేడు మే26న ‘గ్యాంబ్లర్స్’ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'యుద్ధం..జూదం ఒక్కటే! యుద్ధం ఎక్కడ మొదలుపెట్టాలో తెలియాలి.. జూదం ఎక్కడ ఆపాలో తెలియాలి' అనే డైలాగ్ తోనే సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి కలిగించారు. ఇందులో పేకాటలో ఆరితేరిన పాత్రలో సంగీత్ నటించాడు. అతను పేకాటలో వేసే ఎత్తులు, అతన్ని వెంటాడానికి వచ్చే ఓ 5గురు మిస్టరీయస్ వ్యక్తులు, మధ్యలో డైమండ్ కోసం ఒకరికొకరు పోట్లాటతో టీజర్ ఆసక్తిగా సాగింది.
ఎస్‌కే చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జబర్ధస్థ్ కమెడియన్, కేసీఆర్ మూవీ ఫేమ్ రాకింగ్ రాకేష్ ఓ కీలక పాత్రలో కనిపించారు. టీజర్ చివర్లో రాకింగ్ రాకేష్ పాత్ర కాస్తా మిస్టరీయస్గా నిలిచింది. ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసేలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్ట్‌లు ఈ సినిమాలో ఉంటాయనే విషయం టీజర్తో అర్ధమవుతుంది. ఇకపోతే, ఈ సినిమాని నైజాంలో మైత్రి మేకర్స్ రిలీజ్ చేయనున్నారు..
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ చిత్రం జూన్ 6న విడుదల కాబోతోంది. సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మాతలు. గతంలో రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన శ్రీవల్లి సినిమాకు సునీత, రాజ్‌కుమార్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.
“యుద్ధం ఎక్కడ మొదలుపెట్టాలో తెలియాలి.. జూదం ఎక్కడ ఆపాలో తెలియాలి” #SangeethShobhan's #Gamblers teaser out now
— Ramesh Pammy (@rameshpammy) May 26, 2025
♠️♣️🎲🃏https://t.co/OQssbBdAn1#Gamblers in Cinemas June 6, 2025 pic.twitter.com/p1DvXxF08C