ఆస్ట్రేలియా ఓపెన్ సానియా మీర్జా దూకుడు

ఆస్ట్రేలియా ఓపెన్ సానియా మీర్జా దూకుడు

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023లో సానియా మీర్జా సెమీస్ కు చేరుకుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి బరిలోకి దిగిన ఆమె సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో సానియా, బోపన్న జోడీకి వాకోవర్ లభించింది. లాత్వియా, స్పెయిన్‌కు చెందిన జెలెనా ఒస్టాపెంకో ,డేవిడ్ వెగా జంట క్వార్టర్స్ నుంచి తప్పుకోవడంతో సానియా, బోపన్న సెమీ ఫైనల్లోకి చేరారు. అంతకు ముందు ఉరుగ్వే, జపాన్ జోడీ ఏరియల్ బెహార్-మకాటో నినోమియాతో జరిగిన మ్యాచులో సానియా , బోపన్న జంట 6-4, 7-6 తేడాతో గెలిచింది. 

కెరీర్ లో చివరి గ్రాండ్ స్లామ్ ఆడుతున్న సానియా మీర్జా ఆస్ట్రేలియా ఓపెన్ మిక్సడ్ డబుల్స్ టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది.అటు ఇప్పటికే ఉమెన్స్ డబుల్స్ లో ఓడిపోయింది.  కజకిస్థాన్‌కు చెందిన ఏనా డానిలినాతో కలిసి  ఉమెన్స్ డబుల్స్ బరిలో దిగిన సానియా.. రెండో రౌండ్‌లో బెల్జియం, ఉక్రెయిన్ జోడీ అలీసన్ వాన్ ఉయ్‌ట్వాంక్-అనెలినా కలినినా జంట చేతిలో ఓటమి పాలైంది.