గాయంతో యూఎస్ ఓపెన్ నుంచి సానియా మీర్జా ఔట్

గాయంతో యూఎస్ ఓపెన్ నుంచి సానియా మీర్జా ఔట్

ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ..కీలక టోర్నీకి దూరమైంది. గాయం కారణంగా త్వరలో ప్రారంభం కానున్న యూఎస్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. తన మోచేయికి గాయం అయినందున యూఎస్ ఓపెన్ కు దూరమవుతున్నట్లు తెలిపింది. 

గాయం ఎక్కువైంది..
హాయ్ గాయ్స్. మీకో అప్‌డేట్. ఇది  గొప్ప వార్తేం కాదు.  రెండు క్రితం కెనడాలో ఆడుతున్నప్పుడు నా ముంజేయికి, మోచేతికి గాయమైంది. నేను అంత పెద్దగా ఈ గాయాలను పట్టించుకోలేదు. అయితే నిన్న స్కాన్‌ చేయించుకుంటే అసలు విషయం తెలిసింది. దురదృష్టవశాత్తూ గాయం తీవ్రత ఎక్కువ ఉందని తేలింది. ఎముకను పట్టి ఉండే కండర భాగం బాగా నలిగిపోయింది' అని సానియా తన ఇన్ స్టాలో పేర్కొంది. ఈ గాయం నుంచి కోలుకునే దాకా నేను కొన్ని వారాలపాటు రెస్ట్ తీసుకోవాలి. అందువల్లే యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగాను. ఇలా జరగడం కాస్త బాధాగా ఉన్నా.. నాకు చాలా కష్ట సమయం. ఈ గాయం వల్ల యూఎస్ ఓపెన్ పూర్తయ్యాక టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటిద్దామనుకున్నా. కానీ నా ప్లాన్స్ అన్ని చెడిపోయాయి. అందువల్ల ప్రస్తుతం రిటైర్ అవ్వట్లేదు. మిగతా విషయాల గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను' అని సానియా ట్వీట్ చేసింది. 

6 గ్రాండ్ స్లామ్స్ విజయం..
వింబుల్డన్ లో సానియా మీర్జా ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్ లో పరాజయం చవిచూసింది.  2009, 2012లో మహేష్ భూపతితో కలిసి  ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్లను దక్కించుకుంది. తన కెరీర్ లో సానియా మీర్జా ఇప్పటి వరకు 6 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలిచింది. 2014లో బ్రూనో సోరెస్‌తో కలిసి  యూఎస్ ఓపెన్  మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. అయితే యూఎస్ ఓపెన్ 2022 తర్వాత రిటైర్ అవుతానని సానియా ప్రకటించింది. కానీ ప్రస్తుతం గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి తప్పుకుంది.