6.5 శాతం జీడీపీ వృద్ధి సాధిస్తాం: సీఐఐ సంజీవ్‌‌‌‌‌‌‌‌ పూరి

6.5 శాతం జీడీపీ వృద్ధి సాధిస్తాం: సీఐఐ సంజీవ్‌‌‌‌‌‌‌‌ పూరి

న్యూఢిల్లీ: భారతదేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి చెందుతుందని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌ (సీఐఐ) అధ్యక్షుడు సంజీవ్ పూరి అంచనావేశారు. మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, తాత్కాలిక జియోపొలిటికల్  సమస్యలను తట్టుకోగలదని అన్నారు. ఎనర్జీ, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్టేషన్, మెటల్స్, కెమికల్స్, హాస్పిటాలిటీ వంటి వివిధ సెక్టార్లలో ప్రైవేట్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ పెరుగుతున్నాయని పూరి చెప్పారు.  వడ్డీ రేట్లు తగ్గుతున్నాయని,  ద్రవ్యోల్బణం కంట్రోల్‌‌‌‌‌‌‌‌లో ఉందని పేర్కొన్నారు.