యానిమల్ కేర్‌‌‌‌‌‌‌‌లోకి సన్‌‌‌‌ఫార్మా.. రూ.143.3 కోట్లకు వివల్డిస్‌‌‌‌లో  60% వాటా కొనుగోలు

యానిమల్ కేర్‌‌‌‌‌‌‌‌లోకి సన్‌‌‌‌ఫార్మా.. రూ.143.3 కోట్లకు వివల్డిస్‌‌‌‌లో  60% వాటా కొనుగోలు

న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ సన్ ఫార్మాస్యూటికల్స్‌‌‌‌ యానిమల్‌‌‌‌ కేర్ బిజినెస్‌‌‌‌లోకి ఎంటర్ అయ్యింది. యానిమల్ హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ఉన్న వివల్డిస్‌‌‌‌ హెల్త్‌‌‌‌ అండ్ ఫుడ్స్‌‌‌‌ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌లో 60 శాతం వాటాను దక్కించుకుంది. క్యాష్ రూపంలో జరిగిన ఈ డీల్‌‌‌‌ విలువ రూ.143.3 కోట్లు. మిగిలిన 40 శాతం వాటాను  కూడా భవిష్యత్‌‌‌‌లో కొనుగోలు చేస్తామని సన్ ఫార్మా వెల్లడించింది. ఈ ఏడాది మే నాటికి ఈ డీల్ పూర్తవుతుందని అంచనా.

2014 లో ప్రారంభమైన వివల్డిస్‌‌‌‌ హెల్త్‌‌‌‌, యానిమల్స్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం డ్రగ్స్‌‌‌‌ను, ఫుడ్ సప్లిమెంట్స్‌‌‌‌ తయారు చేస్తోంది. పూణెకు చెందిన ఈ కంపెనీకి 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.29.9 కోట్ల రెవెన్యూ వచ్చింది. 2020–21 లో రూ.20.5 కోట్లను, 2019–20 లో రూ.13.8 కోట్లను సాధించింది. గత మూడేళ్లలో కంపెనీ రెవెన్యూ గ్రోత్‌‌‌‌ ఏడాది ప్రాతిపదికన 47 శాతం పెరిగింది. తాజాగా కాన్‌‌‌‌సెర్ట్‌‌‌‌ ఫార్మాస్యూటికల్స్‌‌‌‌ను 576 మిలియన్ డాలర్లకు సన్ ఫార్మా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.