
సారా అలీఖాన్, విక్కీ కౌశల్ జంటగా నటిస్తున్న మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ సభ్యులు ఫస్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. దీనిపై స్పందించిన సారా అలీఖాన్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిందంటే నమ్మలేక పోతున్నానని చెప్పారు. సెట్ లో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. పంజాబీ పాటలు, భోగి మంటలు, చాయ్ కప్పులతో ఉదయాన్నే సాగిన ప్రయాణం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతందనే నమ్మకం ఉందన్నారు.