సిరులనిచ్చే సరళ మైసమ్మ

సిరులనిచ్చే సరళ మైసమ్మ

హైదరాబాద్‌ కు డెభ్బై కిలోమీటర్ల దూరంలో రాచకొండ గుట్టలున్నాయి. ఆ గుట్టల్లో పచ్చని చెట్ల నడుమ కొలు వై ఉంది సరళ మైసమ్మ. ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది. అక్కడికి చేరుకోవాలంటే ఐదు కిలో మీటర్లు అడవిలోనే ప్రయాణించాలి. ఆలయం  నుంచి ఎటు చూసినా కొండలే కనిపిస్తాయి. పేర్చినట్లు ఉండే రాళ్ల కుప్పలు. ప్రశాంతమైన వాతావరణంలో నాట్యమాడే నెమళ్లు, కోతులు ,కొండ ముచ్చు లను చూస్తూ ప్రకృతి ఒడిలో సేద తీరొచ్చు. ఇక్కడికి సెలవు రోజులలో భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ప్రతి సంవత్సరం మే 4న ఘనంగా జాతర జరుగుతుంది. విరాళాలతో ఆలయ నిర్మాణం గతంలో చిన్న ఆలయం ఉండేది. సౌకర్యాలు కూడా సరిగా ఉండేవికావు. అందుకే ఆలయాన్ని అభివృద్ధి చేయాలనుకుంది పాలక మండలి. అనుకున్నదే తడవుగా ఆలయ కమిటీ చైర్మన్‌ అర్ధ వెంకట్‌ రెడ్డి మూడు కోట్ల రూపాయల విరాళాలు సేకరించారు. వాటితో ఉప్పల్‌‌‌‌లో ని రామాలయాన్ని పోలిన గుడిని కట్టించారు. ధ్వజ స్తంభం, శ్రీచక్రం ఏర్పాటు చేయించారు. కొత్తగా కట్టించిన ఆలయం వద్ద కొబ్బరి కాయలు కొట్టడం, జంతువుల్ని బలివ్వడాన్ని నిషేధించారు. అయితే, పాత గుడి దగ్గర జంతువుల్ని బలివ్వచ్చు. సైనికులు మాయం ఆలయ చరిత్రకు సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. ‘‘నిజాం రాజుల పాలనలో సైనికుల కోసం పీపల్‌‌‌‌ గ్రామం నుంచి మేక పోతులు , కోళ్లు, కల్లు కుండలు, సారా సీసాలు తీసుకెళ్లేవాళ్లు. వాటిని సరళ మైసమ్మ ఆలయం ముందు నుంచే తరలించేవాళ్లు.కానీ అమ్మవారికి ఏ రోజూ నైవేద్యం పెట్టలేదు.కల్లు సాక పోయలేదు.

దాంతో ఆగ్రహించిన అమ్మవారు సుడిగాలి రూపంలో సైనికుల స్థా వరాన్ని చెల్లా చెదురు చేసింది. ఆ తర్వాత సైనికులు, గుర్రాలు మాయమైపోయాయి. పొద్దు పోయినా సైనికులు తిరిగిరాక పోవడంతో వాళ్లను వెతుక్కుంటూ సిబ్బం ది స్థా వరాల దగ్గరకు వచ్చారు. అక్కడ సైనికుల అరుపులు వినిపించాయి కానీ వాళ్లు కనిపించలేదు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. మైసమ్మకు మేకపోతులు బలిచ్చి , బోనాల పండుగ చేస్తే సైనికులు తిరిగొస్తారని అక్కడే ఉన్న పశువుల కాపరి సిబ్బం దికి చెప్పాడు. విషయం తెలుసు కున్న నవాబు అమ్మవారికి బోనాల పండుగ చేసి మేక పోతులను బలిచ్చా డు. దాంతో వెంటనే సైనికులు తిరిగొచ్చారని తమ పూర్వీకులు చెప్పినట్లు ఇక్కడి వాళ్లు’’ అంటుంటారు.కుమ్మరి వాళ్లే పురోహితులు మైసమ్మ ఆలయంలో కుమ్మరి కులస్తులే పూజలు చేస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఊళ్లో ఉన్న కుమ్మరి కులస్తులు వంతు ల వారిగా పురోహితులు గా వ్యవహరిస్ తున్నా రు. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉండడంతో పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందింది. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్యతో పాటు పర్యాటకుల సంఖ్య కూడా బాగా పెరిగింది. మరో ప్రత్యేకత ఏంటంటే వంట చేసుకోలేని వాళ్లకు వండిపెడతారు కూడా.
సరదాగా గడపడానికి వెళ్లి వండుకోవడం ఇబ్బం ది అనుకుంటే వాళ్లను సంప్రదించవచ్చు. కిలో చికెన్‌ వండడానికి ఎనభై రూపాయలు తీసుకుం టారు. దట్టమైన అడవి.. కనుచూపు మేర గుట్టలు. ఎవరో పేర్చినట్లు కనిపించే రాళ్ల కుప్పలు. అబ్బుర
పరిచే గుహలు.. వాటి మధ్య కొలువుదీరిన సరళ మైసమ్మ భక్తు ల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లు తోంది. అమ్మవారి సన్నిధిలో ఎటువైపు వెళ్లినా చల్లని గాలి పలకరిస్తుం ది. నిజాం కాలం నుంచి అమ్మవారు నిత్యం పూజలందుకుంటోంది.
మైసమ్మతల్లిని దర్శించుకోవాలంటే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం అల్లాపురం వెళ్లాల ్సిందే.

టూరిస్ట్‌‌‌‌ స్పాట్‌ అమ్మవారిని దర్శించుకుం టే కోరికలు నెరవేరుతాయి. ఇక్కడకి నల్గ ొండ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌ ,
రంగారెడ్డి జిల్లా ల నుంచి భక్తులు పెద్ద ఎత్తు న వస్తుం టారు. ఆలయాన్ని భక్తుల విరాళాలతో కట్టిం చారు. ఇక్కడికి వచ్చే
వాళ్ల సౌకర్యార్థం ప్రభుత్వం గదులు కట్టిస్తే బాగుంటుంది. ఆలయానికి రోడ్డు లేక భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు నిర్మిస్తే సౌకర్యం గా ఉంటుంది. పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందుతుంది.

– యాదయ్య, ఆలయ ఇన్‌ చార్జి