క్రిమినల్ కేసుల విచారణ స్పీడప్ చేయాలి : శరత్​

క్రిమినల్ కేసుల విచారణ స్పీడప్ చేయాలి : శరత్​

యాదాద్రి, వెలుగు:పెండింగ్​లో ఉన్న క్రిమినల్​ కేసుల విచారణ స్పీడప్ చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, యాదాద్రి అడ్మినిస్ట్రేటివ్​ జడ్జి జస్టిస్​ కే శరత్​సూచించారు. శనివారం భువనగిరిలో జిల్లా న్యాయమూర్తులతో  కేసుల పరిష్కారంపై రివ్యూ నిర్వహించారు. కేసుల పరిష్కారంతో పాటు పలు అంశాలపై సూచనలు ఇచ్చారు. అనంతరం జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు సముదాయం కోసం కేటాయించిన పది ఎకరాల స్థలాన్ని పరిశీలించారు.

తర్వాత భువనగిరి సబ్ జైలును సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలకు అందుతున్న న్యాయ సహాయం,  వసతి, సంక్షేమంపై  సమీక్షించారు. అనంతరం యాదగిరిగుట్టలో కొత్త కోర్టు కోసం కేటాయించిన టెంపరరీ బిల్డింగ్‌‌‌‌తో పాటు శాశ్వత నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు.  ఆ తర్వాత జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించారు.

ఆయన వెంట ఆయన వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు, అడిషనల్‌‌‌‌ అదనపు జిల్లా జడ్జి మారుతి దేవి, అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ దశరథ రామయ్య, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్ నాగేశ్వర రావు, అడిషనల్‌‌‌‌ జూనియర్ సివిల్ జడ్జిలు కవిత,  ప్రధీప్, చందన,  సుమలత, మహతి వైష్ణవి, కలెక్టర్​ హనుమంతు జెండగే, డీసీసీ రాజేశ్​ చంద్ర, అడిషనల్​ కలెక్టర్​ భాస్కర్​రావు, ఏసీపీ వెంకట్ రెడ్డి, ఆర్డీవో అమరేందర్​ ఉన్నారు.