క్వాలిటీ లేని ప్రాజెక్టులతో ముప్పు: సరిత

క్వాలిటీ లేని ప్రాజెక్టులతో ముప్పు: సరిత

గద్వాల, వెలుగు: క్వాలిటీ లేని ప్రాజెక్టులతో ప్రజలకు ముప్పు పొంచి ఉందని జడ్పీ చైర్మన్, కాంగ్రెస్  అభ్యర్థి సరిత పేర్కొన్నారు. శనివారం తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ డీపీఆర్  ద్వారా ప్రాజెక్టు పనులు చేపట్టాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా బీఆర్ఎస్  లీడర్ల సొంత ఎజెండాతో ప్రాజెక్టులు నిర్మించడంతో కుంగిపోతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.36 వేల కోట్లతో ఎస్టిమేషన్  వేయగా, దానిని రీడిజైన్​ చేసి రూ.1.30 లక్షల కోట్లకు ఎస్టిమేషన్లు పెంచి తమకు అనుకూలమైన కాంటాక్టర్లకు కట్టబెట్టి వేల కోట్లు కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. 

తరతరాలు ఉండాల్సిన ప్రాజెక్టులు బీఆర్ఎస్  అవినీతి కారణంగా మూడేండ్లకే బీటలు వారుతున్నాయన్నారు. బీఆర్ఎస్  హయాంలో నిర్మించిన ప్రాజెక్టులన్నింటిలో అవినీతి చోటు చేసుకుందని విమర్శించారు. క్వాలిటీ లేని పనులు చేసి వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. డబుల్  బెడ్రూమ్  ఇండ్లలోనూ క్వాలిటీ లేకపోవడంతో, పేదలు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. అవినీతి బీఆర్ఎస్  పార్టీని సాగనంపాలని కోరారు. చెన్నకేశవరెడ్డి, మధుసూదన్ బాబు, శంకర్, తిమ్మన్న, ఇసాక్  పాల్గొన్నారు.