జనగామ హెల్త్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో డిప్యుటేషన్లు రద్దు చేసిన సర్కార్‌‌‌‌‌‌‌‌

 జనగామ హెల్త్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో డిప్యుటేషన్లు రద్దు చేసిన సర్కార్‌‌‌‌‌‌‌‌
  •     ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న 26 మంది జనగామ జిల్లా ఉద్యోగులు
  •     ఇప్పటికే విధుల్లో చేరిన 14 మంది ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌
  •     లోకల్‌‌‌‌‌‌‌‌ డిప్యుటేషనన్లు కూడా రద్దు కావడంతో సొంత పోస్టుల్లోకి 25 మంది

జనగామ, వెలుగు : హెల్త్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో డిప్యుటేషన్లు రద్దు చేయడంతో ఉద్యోగుల్లో హడావుడి నెలకొంది. డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అవసరాలు పక్కన పెడితే వ్యక్తిగత పనుల కోసం పైరవీలు చేసుకొని ఇష్టమొచ్చిన చోట డ్యూటీ చేస్తున్న వారు ఇప్పుడు సొంత స్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జనగామ జిల్లాలో రెగ్యులర్, ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఎం ఉద్యోగులుగా ఉండి డీహెచ్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ నుంచి డిప్యుటేషన్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్లు తెచ్చుకొని ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న వారు 26 మంది ఉన్నారు. ప్రస్తుతం వీరంతా జనగామ జిల్లాలో డ్యూటీలో చేరాల్సి ఉంది. ఇందులో గతంలో ఇక్కడ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వోగా పనిచేసిన మహేందర్‌‌‌‌‌‌‌‌తో పాటు మరో 13 మంది ఇప్పటికే విధుల్లో చేరారు. మిగతా వారు తప్పనిసరిగా రావాల్సిందేనని, లేకపోతే చర్యలు తప్పవని తెలుస్తోంది. మరో వైపు జనగామ జిల్లాలో డిప్యుటేషన్‌‌‌‌‌‌‌‌పై పనిచేస్తున్న 18 మంది కూడా ఇక్కడి నుంచి రిలీవ్‌‌‌‌‌‌‌‌ అయ్యారు.

ఇతర జిల్లాల్లో 26 మంది

జనగామ జిల్లాలో ఒరిజినల్‌‌‌‌‌‌‌‌ పోస్టింగ్‌‌‌‌‌‌‌‌ పొందిన 26 మంది డిప్యుటేషన్‌‌‌‌‌‌‌‌పై ఇతర జిల్లాల్లో పనిచేస్తున్నారు. ఇందులో ఏడీ పీహెచ్‌‌‌‌‌‌‌‌వో ధన్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌ మూడేళ్లుగా నిర్మల్ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వోగా పనిచేస్తున్నారు. అలాగే ప్రోగ్రాం ఆఫీసర్ మహేందర్‌‌‌‌‌‌‌‌ హనుమకొండలో, దేవరుప్పుల పీహెచ్‌‌‌‌‌‌‌‌సీ మెడికల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ చల్లా పూజ మేడ్చల్ జిల్లా కీసర పీహెచ్‌‌‌‌‌‌‌‌సీలో, బచ్చన్నపేట యూపీహెచ్‌‌‌‌‌‌‌‌సీ పారామెడికల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ రమేశ్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ షాపూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ యూపీహెచ్‌‌‌‌‌‌‌‌సీలో, జనగామ డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎండీ.రఫీఖ్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వోగా పనిచేస్తున్నారు.

అలాగే కొడకండ్ల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దయాకర్‌‌‌‌‌‌‌‌ హనుమకొండ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో, స్టేషన్‌‌‌‌‌‌‌‌ఘన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ యూపీహెచ్‌‌‌‌‌‌‌‌సీ హెడ్‌‌‌‌‌‌‌‌ నర్స్‌‌‌‌‌‌‌‌ సుగుణ సిద్దిపేట గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో, జఫర్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ యూపీహెచ్‌‌‌‌‌‌‌‌సీ పబ్లిక్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ నర్స్‌‌‌‌‌‌‌‌ కేజియా సూర్యాపేట జిల్లా కోదాడలో, కోమళ్ల పీహెచ్‌‌‌‌‌‌‌‌సీ ఎంపీహెచ్‌‌‌‌‌‌‌‌ఈవో ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ యాదాద్రి డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో, పాలకుర్తి పీహెచ్‌‌‌‌‌‌‌‌సీ ఎంపీహెచ్‌‌‌‌‌‌‌‌ఈవో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి రంగారెడ్డి జిల్లా మనోహరాబాద్‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్నారు. ఇప్పగూడెం పీహెచ్‌‌‌‌‌‌‌‌సీకి చెందిన ఎంపీహెచ్‌‌‌‌‌‌‌‌ఈవో భగవాన్‌‌‌‌‌‌‌‌రెడ్డి హనుమకొండ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో ఆఫస్‌‌‌‌‌‌‌‌లో, పాలకుర్తి యూపీహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లోని ఎంపీహెచ్‌‌‌‌‌‌‌‌ చంద్రయ్య కూనురులో, బచ్చన్నపేట యూపీహెచ్‌‌‌‌‌‌‌‌సీ స్టాఫ్‌‌‌‌‌‌‌‌నర్స్‌‌‌‌‌‌‌‌ సునీత హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ చింతల్‌‌‌‌‌‌‌‌బస్తీలో, ఇప్పగూడెం పీహెచ్‌‌‌‌‌‌‌‌సీ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ నర్స్‌‌‌‌‌‌‌‌ శిరీష కుషాయిగూడలో, మరో స్టాఫ్ నర్స్ సుహాసిని కొత్తగూడెం జిల్లా ఎంపీ బంజరలో, పాలకుర్తి యూపీహెచ్‌‌‌‌‌‌‌‌సీ స్టాఫ్‌‌‌‌‌‌‌‌నర్స్‌‌‌‌‌‌‌‌ స్వరూప వనస్థలిపురం ఎన్‌‌‌‌‌‌‌‌పీఎం ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌లో, మరో స్టాప్‌‌‌‌‌‌‌‌ నర్స్‌‌‌‌‌‌‌‌ సుజాత కొత్తగూడెం పర్నశాలలో పనిచేస్తున్నారు.

అదేవిధంగా ఇక్కడి డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో ఆఫీస్‌‌‌‌‌‌‌‌ సీనియర్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్ పరమాజీ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నీలోఫర్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో, ఏఎస్‌‌‌‌‌‌‌‌వో మోనిక మిస్లిన మధుర సల్మాన్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో డిప్యుటేషన్‌‌‌‌‌‌‌‌పై డ్యూటీ చేస్తున్నారు. ప్రస్తుతం సర్కార్‌‌‌‌‌‌‌‌ నిర్ణయంతో వీరందరి డిప్యూటేషన్లు రద్దు అయ్యాయి. దీంతో ఇందులో చాలా మంది ఇప్పటికే తమ ఒరిజినల్ పోస్టింగ్‌‌‌‌‌‌‌‌ జిల్లా అయిన జనగామకు వస్తున్నారు.

లోకల్ డిప్యూటేషన్లదీ అదే దారి

జనగామ జిల్లా పరిధిలో ఉండే స్టాప్‌‌‌‌‌‌‌‌ను కూడా గత డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వోలు అవసరాల పేరుతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌పై పనిచేయిస్తూ వచ్చారు. వీరిలో కొందరు ఏళ్ల తరబడి అక్కడే పనిచేస్తూ ఒరిజినల్‌‌‌‌‌‌‌‌ పోస్టుకు వెళ్లడం లేదు. ఈ పోస్టింగ్‌‌‌‌‌‌‌‌లు స్థానిక డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో పరిధిలోనే జరిగేవి కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జనగామ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో ప్రశాంత్‌‌‌‌‌‌‌‌ ఇటీవల ఏసీబీకి పట్టుబడడంతో డిప్యూటీ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వోగా ఉన్న శ్రీదేవికి డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వోగా బాధ్యతలు అప్పగించారు. జిల్లా పరిధిలో మొత్తం 25 మంది డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌పై వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వీరిలో ఐదారేండ్లకు పైబడి డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌పైనే కొనసాగుతున్న వారూ ఉన్నారు. వీరందరి డిప్యుటేషన్లు కూడా రద్దు కావడంతో వారంతా ఒరిజినల్ పోస్టింగ్‌‌‌‌‌‌‌‌లలో రిపోర్టు చేశారు.