నిధులు రాలేదని మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

నిధులు రాలేదని మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

నిర్మల్ జిల్లాలో మహిళా సర్పంచ్ ఆత్మహత్యకు యత్నించింది. పెంబి మండలం వేణునగర్ లో సర్పంచ్ రాధ పురుగుల మందు తాగింది.  స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.  గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు  ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో మనస్తాపానికి గురైన రాధ..ఆత్మహత్యకు ప్రయత్నించింది. 

వేణునగర్ గ్రామంలో సర్పంచ్ రాధ పలు అభివృద్ధి పనులు చేపట్టింది. అప్పు చేసి మరీ గ్రామంలో పనులు చేయించింది. అభివృద్ధి పనులు చేసి నెలలు గడుస్తున్నా..ప్రభుత్వం నుంచి పెండింగ్‭లో ఉన్న బిల్లులకు నిధులు రాక.. మరోవైపు వడ్డీలు పెరగడంతో  ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అప్పులు ఇచ్చినవారు తరచూ ఇంటికి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్దితూ పరుగుల మందు తాగింది. ప్రస్తుతం  రాధ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.