మెదక్ జిల్లాలో నిధులిస్తలేరని బిచ్చమెత్తిన సర్పంచ్ 

మెదక్ జిల్లాలో నిధులిస్తలేరని బిచ్చమెత్తిన సర్పంచ్ 

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్నె గ్రామ ఇంచార్జ్ సర్పంచ్ రాజేందర్ వినూత్న నిరసన తెలిపారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో ఇంటింటికి తిరుగుతూ జోలె పట్టి భిక్షాటన చేశారు. అప్పులు చేసి మరి వెల్మకన్నెలో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని అధికారులను వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన అప్పులకు వడ్డీ చెల్లించలేక పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు పంచాయతీ నిధులు మంజూరు చేయాలని వేడుకున్నారు. 

16 నెలల క్రితం సర్పంచ్ శ్రీనివాస్ చనిపోవడంతో ఉప సర్పంచ్ రాజేందర్ కు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఆయన గ్రామాభివృద్ధికి సంబంధించి పనులు చేపట్టారు. అప్పులు తెచ్చి మరీ గ్రామంలో పనులు చేయించారు. నెలలు గడిచినా నిధులు మంజూరుకాకపోవడంతో పనులు ఆగిపోయాయని, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.