
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు, రెడ్యాల గ్రామ సర్పంచి వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, పలువురు వార్డుసభ్యులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ జెండా పట్టుకోవడానికి నాయకత్వం లేని రోజుల్లో చొరవ తీసుకుని పార్టీ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించానని చెప్పారు. ఏడున్నరేళ్ల పాలనలో తమకు నిరాశే మిగిలిందన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు దక్కడం లేదన్నారు. రెండోసారి టీఆర్ఎస్అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మగౌరవాన్ని చంపుకొని పార్టీలో కొనసాగలేనని చెప్పారు. ఆయనతోపాటు కాంగ్రెస్‌లో చేరిన వారిలో లీడర్లు చాంద్ పాషా, సురేందర్, రాజవర్ధన్, నర్సింగ శ్రీను, కార్తీక్ గౌడ్, వార్డుమెంబర్లు సామ మధుసూదన్ రెడ్డి, బొంగు మల్లయ్య, సూరయ్య, భిక్షం, విజేందర్, భద్రయ్య, శ్రీపాల్, బాబు, కిరణ్, రవి, వెంకట రెడ్డి, గోపాల్, ఇమామ్, రాజు నరేష్, అనిల్ తదితరులున్నారు.