కొత్తగా వచ్చిన లీడర్లతో నష్టమే

కొత్తగా వచ్చిన లీడర్లతో నష్టమే

యాదాద్రి, వెలుగు: ‘పార్టీలో  కొత్త లీడర్ల  చేరడం మంచిదే. కానీ వారిలో కొందరు సర్పంచ్​లనే పట్టించుకోవడం లేదు. ​కొత్తగా చేరిన వాళ్లకు సీడీఎఫ్​ వర్క్స్ ఇవ్వడంపై   సర్పంచ్​లు అసంతృప్తిగా ఉన్నారు. దీనివల్ల పార్టీకి  నష్టం జరుగుతోంది”అని   పలువురు బీఆర్​ఎస్​ ​ లీడర్లు వాపోయారు. శనివారం యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో జరిగిన   ఆత్మీయ సమ్మేళనంలో  లోకల్​ లీడర్లు, ప్రజాప్రతినిధులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.  లీడర్లు, క్యాడర్​ మధ్య సమన్వయం లోపించిందన్నారు.    లీడర్లతో సఖ్యత లేకపోవడం వల్లే  కొందరు సర్పంచులు ఈ మీటింగ్​కు   రాలేదని చెప్పారు.  వారితో పెద్ద లీడర్లు మాట్లాడాలని,   ఎన్నికల  టైమ్​లో నష్టాన్ని నివారించడానికి   కో ఆర్డినేషన్​ కమిటీ ఏర్పాటు చేయాలని  సూచించారు. మొదటినుంచి పార్టీలో ఉన్నా తమను పట్టించుకోకపోవడం,  ఇతర పార్టీల్లోంచి వచ్చినవారికి  పనులు జరుగుతుండడంతో  కేడర్​ నారాజ్​గా ఉందన్నారు.  

రుణమాఫీపై   రైతుల్లో వ్యతిరేకత

మళ్లీ ఎన్నికలు  వస్తున్నా ఇంకా  రూ. లక్ష రుణమాఫీ కాకపోవడంపై    రైతుల్లో వ్యతిరేకత ఉందని వారు అన్నారు.   తన ఇంట్లో వారికే పింఛన్​ ఇప్పించుకోలేక పోయానని ఓ లీడర్​ ఆవేదన వ్యక్తం చేశారు.  గృహలక్ష్మి స్కీంలో పార్టీ  వారికే ప్రయారిటీ ఇవ్వాలని కోరారు.  గ్రామాల్లో బీఆర్​ఎస్​ సర్కార్​ ఎంతో డెవలప్​ చేస్తోందని సీఎం కేసీఆర్​ దత్తత గ్రామమైన వాసాలమర్రి సర్పంచ్​ పోగుల ఆంజనేయులు తెలిపారు.  ‘‘వాసాలమర్రిలో సమస్యలున్నాయి. .అవి ఎమ్మెల్యే సునీతకు తెలుసు. సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లండి”అని కోరారు.  ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నర్సింహులు, బూడిద భిక్షమయ్య గౌడ్​, డీసీసీబీ చైర్మన్​ గొంగిడి మహేందర్​రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్ పాల్గొన్నారు.