బిల్లులు మంజూరు చేస్తలేరు..జీతాలు ఎట్ల ఇయ్యాలి

బిల్లులు మంజూరు చేస్తలేరు..జీతాలు ఎట్ల ఇయ్యాలి

తెలంగాణలో సర్పంచుల పరిస్థితి దారుణంగా తయారైంది. అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయడం లేదు. దీంతో సర్పంచులు అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. బిల్లులు చెల్లించాలంటూ సర్పంచులు ఎన్ని సార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా...స్పందించడం లేదు. కొందరైతే అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. పట్టించుకోవడం లేదు. తాజాగా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేయాలంటూ  జగిత్యాల జిల్లాలో సర్పంచులు పెట్రోల్ డబ్బాలతో నిరసన తెలిపారు. 
  
జగిత్యాల మండల పరిషత్ సర్వ సభ్య సమావేశంలో బిల్లు రావడం లేదని  సర్పంచులు పెట్రోల్ డబ్బాలతో నిరసన తెలిపారు. లక్షలు పెట్టి అభివృద్ధి పనులు చేస్తే బిల్లులు రాక అప్పుల పాలు అయ్యామని సర్పంచుల ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా అధికారులు డైవర్ట్ చేశారని మండిపడ్డారు.  సర్పంచులకు స్వేచ్ఛ,పవర్ లేదా? అని ప్రశ్నించారు. ఒక్కో సర్పంచ్ కి 30 నుంచి 40 లక్షల బిల్లులు రావాలని..నాలుగు నెలల నుంచి సపాయివాళ్లు పనులు చేస్తున్నారని.. బిల్లులు ఇవ్వకపోతే వాళ్లకు జీతాలు ఎలా ఇవ్వాలని నిలదీశారు. 
కరెంట్ బిల్లులు ఎట్లా కట్టాలని ప్రశ్నించారు