
నెపోలియన్, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, సెబాస్టియన్, రౌడీ బాయ్స్, హిట్ 2, హిట్ 3 ప్రాంచైజీల్లో నటించి ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపును తెచ్చుకుంది కోమలీ ప్రసాద్. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కోమలీ.. తాజాగా తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను షేర్ చేసింది.
Draped in dreams, desires and stardust 🤍✨
— Komalee Prasad (@komaleeprasad) September 26, 2025
For #sasivadane pic.twitter.com/BAFDuyQLwZ
వైట్ గౌనులో అందర్నీ ఆకట్టుకునేలా ఉన్న తన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే కోమలీ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘శశివదనే’. రక్షిత్ అట్లూరికి జంటగా నటిస్తోంది. శనివారం ఈ మూవీ ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. సెప్టెంబర్ 29న ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ‘హృదయాలు కలిసే చోట, ప్రేమకథలు వికసించే చోట..’ అంటూ ట్రైలర్ అప్‌డేట్ ఇవ్వడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
మోహన్ ఉబ్బన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఈ చిత్రాన్ని అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల నిర్మిస్తున్నారు. ఫీల్ గుడ్ వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. శరవణ వాసుదేవన్ సంగీతం, అనుదీప్ దేవ్ నేపథ్య సంగీతం అందించారు. అక్టోబర్ 10న సినిమా విడుదల కానుంది.
►ALSO READ | OG Box Office: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ 3 డేస్ కలెక్షన్స్.. గ్రాస్, నెట్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?