హైదరాబాద్, వెలుగు: ప్రొడక్ట్ ఇంజనీరింగ్, డిజిటల్ ట్రాన్స్మిషన్ సేవల సంస్థ సాస్కెన్ టెక్నాలజీస్ హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ని ప్రారంభించించింది. క్వాల్కమ్ వంటి స్ట్రాటెజిక్ చిప్‌సెట్ కస్టమర్లు, ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ (ఓఈఎమ్) లతో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ కేంద్రం తోడ్పడుతుంది.
కనెక్టెడ్ డివైజ్‌లు, 5జీ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) సొల్యూషన్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, డిజిటల్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్‌పై ఈ కేంద్రం దృష్టి సారిస్తుంది. ఆటోమోటివ్, స్మార్ట్ పరికరాలు, హైటెక్, శాటిలైట్ కమ్యూనికేషన్ వంటి పరిశ్రమల కోసం ఈ సెంటర్ సేవలు అందిస్తుంది. రాబోయే నెలల్లో100 మందికి పైగా నిపుణులను నియమించుకోవాలని సాస్కెన్ యోచిస్తోంది.
