మే14వ తేదీ నుంచి యధావిధిగా శాతవాహన వర్సిటీ డిగ్రీ పరీక్షలు : ఎగ్జామ్స్ కంట్రోలర్ సురేశ్ ​

మే14వ తేదీ నుంచి యధావిధిగా శాతవాహన వర్సిటీ డిగ్రీ పరీక్షలు : ఎగ్జామ్స్ కంట్రోలర్ సురేశ్ ​
  • ఎగ్జామ్స్ కంట్రోలర్ సురేశ్ ​వెల్లడి

కరీంనగర్ టౌన్,వెలుగు:  శాతవాహన యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2,4,6వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు టైమ్ టేబుల్ ప్రకారమే ఈనెల 14వ తేదీ  నుంచి యధావిధిగా ప్రారంభమవుతాయని వర్సిటీ ఎగ్జామ్స్ కంట్రోలర్ సురేశ్​తెలిపారు.  విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. పరీక్ష ఫీజులు చెల్లించిన కాలేజీ విద్యార్థులకే పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఫీజు చెల్లించని ప్రైవేట్ కాలేజీలు ఈనెల12లోగా చెల్లిస్తాయని భావిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామని, త్వరలోనే హాల్ టికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు.