
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. దీంతో వర్షాల కారణంగా పలు యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడుతున్నాయి. తాజాగా.. కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీ పరధిలో ఈరోజు ( ఆగస్టు 28) జరగాల్సిన బి.ఎడ్, ఎం.ఎడ్ (బాచిలర్, మాస్టర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్) పరీక్షలను భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు తెలిపిన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి సురేష్ కుమార్ తెలిపారు.మిగిలిన పరీక్షలు యధావిధిగా జరుగుతాయని .. వాయిదా వేసిన పరీక్షల షెడ్యూల్ ను మరల తెలియజేస్తామని తెలిపిన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి తెలిపారు.
కాకతీయు యూనివర్శిటీ పరిక్షలు కూడా..
కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో ఆగస్టు28, 29 తేదీలలో జరిగే .. డిగ్రీ... పీజీ పరీక్షలు వాయిదా వేశారు.
భారీ వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్టు కేయు పరీక్షల నియంత్రణ అధికారి ఫ్రొఫెసర్ రాజేందర్. తెలిపారు. మిగతా పరీక్షలు యధావిధిగా జరుగుతాయని.. వాయిదా వేసిన పరీక్షలు మరలా ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామన్నారు.