మళ్లీ రన్నరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సరి.. ఇండియా ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఓడిన సాత్విక్-చిరాగ్

మళ్లీ రన్నరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సరి.. ఇండియా ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఓడిన  సాత్విక్-చిరాగ్

న్యూఢిల్లీ: ఇండియా డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చిరాగ్ షెట్టి మరోసారి ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోరులో నిరాశ పరిచారు. సొంతగడ్డపై ఫేవరెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగిన సాత్విక్–చిరాగ్ ఇండియా ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 750 టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రన్నరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టారు. ఆదివారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఆసియా చాంపియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెండో సీడ్ సాత్విక్–చిరాగ్ 21–15, 11–21, 18–21తో వరల్డ్ చాంపియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంగ్ మిన్ హ్యుక్–సెయో సాగ్ జయె (కొరియా) చేతిలో పోరాడి ఓడిపోయారు.

దాంతో వరుసగా రెండో టోర్నీలో రన్నరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచారు. గత వారం మలేసియా ఓపెన్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1000 టోర్నీలోనూ కొరియా జంట చేతిలోనే ఓడి  సెకండ్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించారు. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరంభంలో ఇండియా షట్లర్లు సూపర్ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. భారీ ర్యాలీలతో పాటు అద్భుతమైన షాట్లతో తొలి గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేశారు. నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద చిరాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెలరేగడంతో 11–9తో బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆ తర్వాత ఆధిక్యాన్ని 19–13కి పెంచుకొని ఈజీగా తొలి గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగారు.

కానీ, రెండో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అనూహ్యంగా తడబడ్డారు. 1–5తో వెనుకబడిన తర్వాత షాట్లలో వేగం పెంచి, మెరుగైన రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 5–7తో పుంజుకునే ప్రయత్నం చేశారు. కానీ, నెట్ వద్ద చిరాగ్ చేసిన తప్పిదాలకు తోడు మెరుగైన డిఫెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూపెట్టిన కొరియా ప్లేయర్లు 15–5తో లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి అదే జోరుతో గేమ్ నెగ్గి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచారు. మూడో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొరియా షట్లర్ల హవా నడించింది. కాంగ్ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టులో జోరు చూపెట్టడంతో 11–6తోముందంజ వేశారు. బ్రేక్ తర్వాత ఫ్రంట్ కోర్టులోకి వచ్చిన సాత్విక్  మెరుగైన పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు.

దాంతో ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 13–15తో ప్రత్యర్థులను అందుకున్నారు. ఇక్కడి నుంచి చెరో పాయింట్ నెగ్గుతూ గేమ్ పోటాపోటీగా నడిచింది. ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హ్యాండ్ కార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సాత్విక్ అద్భుతమైన షాట్ కొట్టినా.. చిరాగ్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద తప్పిదం చేశాడు. ఆ వెంటనే కాంగ్ ఓ పవర్ ఫుల్ షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కొరియా జోడీ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెండు పాయింట్ల దూరంలో నిలిచింది. చిరాగ్ ఓ పాయింట్ రాబట్టినా.. సాత్విక్ కొట్టిన షాట్ వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వెళ్లడంతో కొరియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండు మ్యాచ్ పాయింట్లపై నిలిచారు. ఆపై చిరాగ్ షాట్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తగలడంతో  ఇండియా జోడీకి పరాజయం తప్పలేదు.

తై జుయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, షి యుకికి టైటిల్స్

విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చైనీస్ తైపీ స్టార్ తై జుయింగ్ తొలిసారి ఇండియా ఓపెన్ టైటిల్ గెలిచింది. ఫైనల్లో ఆమె 21–16, 21–12తో చెన్ యుఫీ (చైనా)ని ఓడించింది. మెన్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరల్డ్ నం.2 షి యుకి (చైనా)23–21, 21–17తో లీ చెయుక్ యియు (హాకాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై నెగ్గి చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు.