
సత్యదేవ్ హీరోగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రామాంజనేయులు జవ్వాజి నిర్మిస్తున్న చిత్రం ‘ఫుల్ బాటిల్’. సంజన ఆనంద్ హీరోయిన్. ఈ మూవీ ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో లాంచ్ చేసి క్రేజీగా ఉందని ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌కి దర్శకులు చందు మొండేటి, రాహుల్ సాంకృత్యాయన్, కార్తీక్ దండు, సాయి రాజేష్, హేమంత్ మధుకర్, రైటర్ కోన వెంకట్ హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
సత్యదేవ్ మాట్లాడుతూ ‘ఫుల్ బాటిల్ అంటే నాలుగు క్వార్టర్స్. అలాగే మనిషి జీవితం కూడా నాలుగు భాగాలు కాబట్టి.. ఈ టైటిల్ తీసుకున్నా అని చెప్పాడు శరణ్. మెర్క్యూరి సూరి పాత్రలో నన్ను చాలా కొత్తగా చూపించాడు. ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా సినిమా ఉంటుంది’ అని అన్నాడు.
శరణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ ‘‘తిమ్మరసు’ తర్వాత మా కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది. సత్యదేవ్ చాలా కొత్తగా కనిపిస్తారు. సాయి కుమార్, సునీల్, బ్రహ్మాజీ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. కాకినాడ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే డ్రామా అందర్నీ ఆకట్టుకుంటుంది’ అని చెప్పాడు. ‘టీజర్ ఫుల్ కిక్‌తో ఉంది. సత్యదేవ్ ప్రతి మూవీకి మార్కెట్ పెంచుకుంటున్నారు. ఇదే బ్యానర్‌లో ఆయనతో మరో సినిమా చేయాలనుంది’ అన్నారు నిర్మాత రామాంజనేయులు. బ్రహ్మాజీ, లక్ష్మీ భూపాల తదితరులు పాల్గొన్నారు.