సత్యదేవ్, ఫారియా అబ్దుల్లా కొత్త సినిమా షురూ

సత్యదేవ్, ఫారియా అబ్దుల్లా కొత్త సినిమా షురూ

సత్యదేవ్ హీరోగా లక్ష్మినారాయణ పుట్టంచెట్టి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతోంది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్.  త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. సత్యదేవ్ కెరీర్‌‌‌‌లో ఇది 15వ సినిమా.  బుధవారం  రామానాయుడు స్టూడియోస్‌‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని  ప్రారంభించారు.  హీరోహీరోయిన్స్​పై తీసిన ఫస్ట్ షాట్‌‌కు దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్‌‌ ఇచ్చారు.  

నిర్మాత వంశీ నందిపాటి కెమెరా స్విచ్‌‌ ఆన్‌‌ చేశారు. అనంతరం దర్శకుడు లక్ష్మినారాయణ మాట్లాడుతూ ‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్‌‌‌‌గా ఈ సినిమా ఉండబోతోంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌‌ మొదలవనుంది. రామ్ మిరియాల  ఫస్ట్ టైమ్‌‌ ఓ పూర్తి సినిమాకు సంగీతం అందిస్తున్నారు’ అని చెప్పారు.  

ఇప్పటికే రెండు పాటల  రికార్డింగ్ పూర్తయిందని మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల చెప్పారు. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, వైవా హర్ష, ఎస్ఎస్ కాంచి, సురేష్ గురు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.