ఇంటెన్స్‌‌‌‌ లుక్‌‌‌‌లో ఆకట్టుకున్న సత్యదేవ్.. కింగ్‌‌‌‌డమ్ మూవీ నుంచి ‘శివ’ పోస్టర్ రిలీజ్

ఇంటెన్స్‌‌‌‌ లుక్‌‌‌‌లో ఆకట్టుకున్న సత్యదేవ్.. కింగ్‌‌‌‌డమ్ మూవీ నుంచి ‘శివ’ పోస్టర్ రిలీజ్

ఓ వైపు లీడ్ రోల్‌‌‌‌లో నటిస్తూనే, మరోవైపు కీలక పాత్రలతోనూ మెప్పిస్తూ..  తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు సత్యదేవ్. శుక్రవారం తన పుట్టినరోజు. ఈ సందర్భంగా తను నటిస్తున్న చిత్రాల అప్‌‌‌‌డేట్స్‌‌‌‌తో బర్త్‌‌‌‌డే విషెస్ తెలియజేశారు మేకర్స్. వాటిలో ‘కింగ్‌‌‌‌డమ్’ చిత్రం ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ ఇంపార్టెంట్ రోల్‌‌‌‌లో కనిపించనున్నట్టు రివీల్ చేశారు. ఇందులో తను ‘శివ’ అనే పాత్ర పోషిస్తున్నట్టు కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌తో బర్త్‌‌‌‌డే విషెస్ తెలియజేశారు.  

ఇంటెన్స్‌‌‌‌ లుక్‌‌‌‌లో కనిపిస్తున్న సత్యదేవ్ స్టిల్ సినిమాలోని  తన పాత్రపై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సూరిగా కనిపించనున్నాడు. సూరి, శివ మధ్య వచ్చే సీన్స్ సినిమాకు హైలైట్‌‌‌‌గా నిలవనున్నాయని తెలుస్తోంది.   భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌‌‌‌పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య  నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే సినిమా విడుదల కానుంది.