‘గుర్తుందా శీతాకాలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న సత్యదేవ్

‘గుర్తుందా శీతాకాలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న సత్యదేవ్

బ్యాక్ టు బ్యాక్ ఈ ఏడాది నాలుగు సినిమాల్లో కనిపించిన సత్యదేవ్.. ఇప్పుడు తమన్నాతో కలిసి ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. నాగశేఖర్ దర్శకత్వంలో చింతపల్లి రామారావు, భావన రవి కలిసి నిర్మించిన ఈ మూవీ ఈరోజు రిలీజ్ అవుతోన్న సందర్భంగా సత్యదేవ్ ఇలా ముచ్చటించాడు. 

‘‘కెరీర్ స్టార్టింగ్‌‌‌‌లో చేయాల్సిన లవ్‌‌‌‌ స్టోరీస్ ఇప్పుడు చేయడం హ్యాపీగానే ఉంది. ఈ వయసులో కూడా చేయకపోతే తర్వాత చేయలేమనిపించింది. ఇందులో మూడు డిఫరెంట్ షేడ్స్‌‌‌‌లో  కనిపిస్తా. స్కూల్, కాలేజ్, మిడిల్ ఏజ్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో ఇన్ని  వేరియేషన్స్ చేసే చాన్స్ రావడం  చాలా అరుదు. కాలేజ్ ఎపిసోడ్‌‌‌‌ అందర్నీ ఆకట్టుకుంటుంది. కన్నడలో హిట్టైన ‘లవ్ మాక్‌‌‌‌టెయిల్‌‌‌‌’కి రీమేక్‌‌‌‌ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశాం. ఇంతకుముందు ఇదే జానర్‌‌‌‌‌‌‌‌లో ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, ప్రేమమ్ లాంటి సినిమాలు వచ్చినా ఇందులో కొత్తదనం కనిపిస్తుంది. హీరోయిన్ తమన్నా అనగానే ముందు షాక్ అయ్యాను. ‘ఆమె మన రేంజ్ కాదు’ అనే డైలాగ్ కూడా సినిమాలో పెట్టాం. నిధి పాత్రలో బాగా యాక్ట్ చేసింది. స్ర్కీన్‌‌‌‌పై తమన్నా  కాకుండా నిధిగానే కనిపిస్తుంది. చిరంజీవి, నయనతార, ఛార్మి, తమన్నా లాంటి సీనియర్స్‌‌‌‌తో  వర్క్ చేయడంతో  చాలా విషయాలు నేర్చుకున్నా. వారి దగ్గర అంతా టైమ్ ప్రకారం జరిగిపోతుంది.  టైమ్ వేస్ట్ కాదు, షూటింగ్ కూడా స్పీడ్‌‌‌‌గా సాగుతుంది.  అలాగే లవ్ స్టోరీస్ అంటేనే యూనివర్సల్ సబ్జెక్ట్స్‌‌‌‌. అవి ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులకు నచ్చుతాయి. ఈ మధ్యే వచ్చిన  సీతారామం, లవ్ టుడే  సినిమాలను ఆదరించినట్లే  ఇప్పుడు  ‘గుర్తుందా శీతాకాలం’ను  కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నా. ఇక కృష్ణమ్మ,  ఫుల్ బాటిల్ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌ స్టేజ్‌‌‌‌లో ఉన్నాయి.  తమిళ, కన్నడ భాషల్లో ఓ ప్రాజెక్ట్‌‌‌‌తో పాటు మరికొన్ని పైప్‌‌‌‌ లైన్‌‌‌‌లో ఉన్నాయి’.