కార్తి, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌లో ‘జాను’ ఫేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘సత్యం సుందరం’. శ్రీదివ్య హీరోయిన్. సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెలుగులో రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది అని టీమ్ చెబుతోంది.
ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో కార్తి మాట్లాడుతూ ‘సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంత ప్రేమని ఇస్తున్న అందరికీ థ్యాంక్యూ.
ఆడియెన్స్ చూపించిన లవ్‌కి చాలా ఎమోషనల్ ఫీలయ్యా. ఈ సినిమా విజయం ఇలాంటి మరిన్ని సినిమాలు చేయాలనే నమ్మకాన్ని ఇచ్చింది’ అని చెప్పాడు. ఇది తనకు కొత్త అనుభూతిని ఇచ్చిందని దర్శకుడు ప్రేమ్ కుమార్ చెప్పాడు. హీరోయిన్ శ్రీదివ్య రైటర్ రాకేందు మౌళి, నిర్మాత జాన్వీ నారంగ్ పాల్గొన్నారు.