గిరిజన సంస్కృతికి ప్రతీక తీజ్

గిరిజన సంస్కృతికి ప్రతీక తీజ్

మహబూబాబాద్, వెలుగు :  గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు తీజ్​ప్రతీక అని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ పేర్కొన్నారు. మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండలంలో ఆదివారం తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి  గోధుమ మొలకల బుట్టలను నెత్తిన పెట్టుకొని గిరిజన యువతులతో కలసి  నృత్యం చేశారు. అనంతరం మాట్లాడుతూ గిరిజనులు తమ సంస్కృతిని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, జడ్పీ చైర్​ పర్సన్ అంగోత్ బిందు, ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ హరి సింగ్ నాయక్, ఎంపీపీ మౌనిక, పీఏసీఎస్‌‌ చైర్మన్ మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిపెడ : మరిపెడ మండలం అజ్మీర తండా పంచాయతీ డక్న తండాలో నిర్వహించిన తీజ్​వేడుకల్లో ఎమ్మెల్యే రెడ్యానాయక్ పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి తీజ్ బుట్టలను ఎత్తుకొన్నారు. కార్యక్రమంలో జిల్లా లైబ్రరీ చైర్మన్ నవీన్ రావు, ఎంపీపీ రాంబాబు, జడ్పీటీసీ శారద, సర్పంచ్ దేవిక, టీఆర్ఎస్ లీడర్లు పాల్గొన్నారు. అనంతరం రంగాపురం నుంచి ఆళ్లగడ్డ తండా వరకు రూ.70 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.