ఢిల్లీలో లాక్డౌన్ ఉండదు

ఢిల్లీలో లాక్డౌన్ ఉండదు

ఢిల్లీ : దేశ రాజధానిలో లాక్ డౌన్ విధించే అవకాశంలేదని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ప్రకటించారు. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఇప్పట్లో లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదని అన్నారు. వీకెండ్ కర్ఫ్యూ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ఢిల్లీ సర్కారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించడంతో పాటు ప్రైవేట్ ఆఫీసుల్లో 50 శాతం సిబ్బందికే అనుమతించనున్నట్లు ప్రకటించింది.  బస్సులు, మెట్రోలో మాత్రం పూర్తి స్థాయిలో ప్రయాణీకుల్ని అనుమతించనున్నట్లు సత్యేంద్ర జైన్ ప్రకటించారు. 

గత 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 5,500 కొత్త కేసులు నమోదుకాగా.. పాజిటివిటీ రేటు 6.46 శాతం నుంచి 8.5శాతానికి పెరిగింది. దేశ రాజధానిలో వరుసగా రెండు రోజులు పాజిటివిటీ రేటు 5శాతాన్ని మించి నమోదవడంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించి మరిన్ని ఆంక్షలు విధించడంపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రెడ్ అలర్ట్ జారీ చేసే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు రానున్న రోజుల్లో ఢిల్లీలో కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని ఆరోగ్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. జనవరి 15 నాటికి రోజుకు 20 -25 వేల కేసులు నమోదవుతాయని అంటున్నారు.

For more news

శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కర్ఫ్యూ

బీజేపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారు