
రియాద్: సౌదీ అరేబియాకు చెందిన ఆడాళ్లు ఇక నుంచి మగ గార్డియన్ పర్మిషన్ లేకుండానే విదేశాలకు వెళ్లొచ్చని ఆ దేశ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఆ దేశానికి చెందిన ఆడాళ్లు విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా తండ్రి, భర్త, లేదా ఎవరైనా చుట్టాల పర్మిషన్ ఉండాలి. ఇప్పుడు దాన్ని మారుస్తూ అధికారులు రూల్స్ పాస్‌చేశారు. కొత్త రూల్ రావడంతో 21 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు గార్డియన్ అనుమతి లేకుండానే పాస్‌పోర్ట్ ఇస్తారని స్థానిక మీడియా చెప్పింది. సౌదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు మెచ్చుకున్నారు.