వీక్ నెస్ కు గుడ్ బై చెప్పండిక.. దానిమ్మ జ్యూస్ బలంగా ఉంచుతుంది

వీక్ నెస్ కు గుడ్ బై చెప్పండిక..  దానిమ్మ జ్యూస్ బలంగా ఉంచుతుంది

దానిమ్మలో ఐరన్ సహా అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ రసంలో విటమిన్ సి, ఇ, కె, మెగ్నీషియం వంటి ఎన్నో ఆరోగ్యకరమైన ఖనిజాలున్నాయి. ఇది ఆరోగ్య పరంగా అనేక విధాలుగా మేలు చేస్తుంది. దానిమ్మలో కొన్ని యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్.. నరాలు, కండరాలు సమర్థవంతంగా పని చేసేలా చేస్తాయి.

నరాలకు..

దానిమ్మపండులో ఎల్లాగిటానిన్స్ అనే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి శరీరంలో మంటను తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. అంతేకాకుండా నరాలకు బలాన్ని ఇస్తాయి. ఇందులోని మెగ్నీషియం నరాలు, కండరాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

కండరాల బలానికి..

దానిమ్మ.. శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిని తగ్గించి కండరాల బలాన్ని పెంచుతుంది. దాంతో పాటు ఇందులో ఉండే ఐరన్.. శరీరంలో రక్తహీనతను తొలగిస్తుంది. కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఇది సహాయపడుతుంది.

దానిమ్మ రసం ఎప్పుడు, ఎలా తీసుకోవాలి

రోజుకు కనీసం ఒక్కసారైనా దానిమ్మ రసం తాగాలి. వీలైనంత వరకు తాజాగా తీసిన రసాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇది కండరాలు, నరాలకు మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది.